Rohit Sharma: టెస్ట్ ఆరంభానికి ముందు బిగ్ షాక్, రోహిత్ శర్మకు గాయం!
Rohit Sharma: ప్రాక్టీస్‌లో రోహిత్ ఎడమ చేయి బొటనవేలికి గాయమైంది. దీంతో తొలి టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Rohit Sharma Injury: దక్షిణాఫ్రికా(South Africa) తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా(Team India)ను వరుస గాయాలు ఆందోళన పరుస్తున్నాయి. భారత్ (Bharat)వేదికగా జరిగిన ప్రపంచకప్(World Cup) లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పటికే గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమవ్వగా.. ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. మరోవైపు ఆకస్మికంగా విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి వారం రోజుల ముందు స్వదేశానికి వచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ(Rohit Sharma) గాయపడడం టీమిండియాను ఆందోళన పరుస్తోంది. ప్రాక్టీస్‌లో రోహిత్ ఎడమ చేయి బొటనవేలికి గాయమైంది. దీంతో తొలి టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌ను జట్టు నుంచి దూరం కావడం భారత్‌ను షాక్‌కు గురి చేసింది.
సఫారీ గడ్డపై టీ 20సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇప్పుడు టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే గాయాలు భారత జట్టును వేధిస్తుండగా ఇప్పుడు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. షమీ జట్టుకు దూరమైన కొన్ని రోజులకే టీం ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ తప్పుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.. ఇషాన్ కిషన్ స్థానంలో కె. ఎస్. భరత్ ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ... దక్షిణాఫ్రికా నుంచి ఆకస్మికంగా తిరిగి భారత్‌కు వచ్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ కారణంగా కోహ్లీ సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 26 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు నాటికి కోహ్లీ జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది.