Rohit Sharma: బజ్‌బాల్‌కు దీటుగా ‘రోబాల్’ - టీమిండియా దంచుడుకు రికార్డులు బ్రేక్
IND vs WI: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ‘దంచుడు మంత్రాన్ని’ పఠించింది. ఈ టెస్టులో భారత బ్యాటర్లు టీ20 ఆటతో రెచ్చిపోయారు.
Rohit Sharma: టెస్టులలో గత ఏడాది కాలంగా వినిపిస్తున్న మాట ‘బజ్‌బాల్’. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తమ ఆటతీరుకు పెట్టుకున్న పేరు ఇది. ఇంగ్లాండ్ హెడ్‌కోచ్ మెక్‌కల్లమ్ ముద్దు పేరు ‘బజ్’కు బాల్ తగిలించి దానిని బజ్‌బాల్ ఆట అంటున్నారు. కాగా టీమిండియా ఇప్పుడు దానికి మించి దూకుడును ప్రదర్శించింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టీ20 ఆటను తలపిస్తూ.. 24 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 181 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ తరహా ఆటతీరును టీమిండియా సారథి, హెడ్‌కోచ్‌ల పేర్లు కలిసేలా ‘రోబాల్’, ‘ద్రావ్‌బాల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టెస్టులలో టీ20 ఆట..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో ఆట నాలుగో రోజు విండీస్‌ను 255 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టీ20 ఆటను ఆడారు. 11.5 ఓవర్లలోనే ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్, జైస్వాల్ నిష్క్రమించినా ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (37 బంతుల్లో 29 నాటౌట్, 1 ఫోర్) లు కూడా దంచికొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యంతో కలిపి రెండో ఇన్నింగ్స్ స్కోరు (181)తో కలిపి భారత్.. వెస్టిండీస్ ముందు 365 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే వెస్టిండీస్.. 32 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. చివరిరోజు టెస్టును కాపాడుకోవాలంటే ఆ జట్టు.. 289 పరుగులు చేయాలి. భారత్‌కు 8 వికెట్లు కావాలి.
రికార్డుల జాతర..
- నిన్న రోహిత్ 57 పరుగులు చేయడం ద్వారా టెస్టులలో వరుసగా 30 ఇన్నింగ్స్‌లలో ‘డబుల్ డిజిట్’ స్కోరు చేసిన ఆటగాడిగా లంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దెనె రికార్డును బ్రేక్ చేశాడు. మహేళ.. 29 ఇన్నింగ్స్‌లలో డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. గత 30 ఇన్నింగ్స్‌లలో రోహిత్ స్కోర్లు : 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 31, 12, 12, 35, 15, 43, 103, 80, 57గా నమోదయ్యాయి.
THE HITMAN CREATES HISTORY...!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2023
Rohit Sharma holds the record of scoring most consecutive double digit scores in Test cricket history - 30. pic.twitter.com/M8jNVSYm7S
- నాలుగో రోజు ఆటలో భారత జట్టు రికార్డుల మోత మోగించింది. టెస్టులలో టీ20 ఆట ఆడిన భారత్.. 12.2 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. గతంలో ఈ రికార్డు.. శ్రీలంక పేరిట ఉండేది. లంక జట్టు.. 2001లో బంగ్లాదేశ్‌పై 13.2 ఓవర్లలో సెంచరీ కొట్టింది. గతేడాది ఇంగ్లాండ్.. పాకిస్తాన్‌పై 13.4 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది.
- టెస్టులలో రోహిత్‌కు ఇది ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. నిన్న అతడు 35 బంతులలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Rohit Sharma scored his fastest fifty in Tests - 35 balls.
— Johns. (@CricCrazyJohns) July 23, 2023
Hundred, fifty followed by another fifty - What a series for Hitman. pic.twitter.com/aHD5p6Xmay
- ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 33 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున ఇది ఫాస్టెస్ట్ ఫిఫ్టీలలో రెండోది. గతంలో రిషభ్ పంత్.. 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 2006లో ధోని.. పాకిస్తాన్ మీద 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ధోని రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు.
- ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కలిగిన వికెట్ కీపర్లలో ఇషాన్ మూడో స్థానంలో నిలిచాడు. నిన్నటి ఇన్నింగ్స్‌లో ఇషాన్ స్ట్రైక్ రేట్.. 152.94గా ఉంది. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (172.88), రిషభ్ పంత్ (161.22) లు ముందున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial