Rishabh Pant Century: రిషబ్ పంత్ ఇంగ్లండ్ గడ్డపై రికార్డుల మోత! టెస్ట్ మ్యాచ్‌లో సంచలన సెంచరీలు
టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ వికెట్ కీపర్ రిషభ్ పంత్. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేయడం రికార్డు.

IND Vs England 1st Test | ఇంగ్లండ్ - ఇండియా తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియన్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రికార్డుల మీద రికార్డులు సృష్టించడం విశేషం. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కు బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్ సెంచరీ చేయడం ద్వారా పలు రికార్డులు తిరగరాయడం జరిగింది. 118 పరుగుల వద్ద రిషభ్ పంత్ ఔట్ అయ్యారు. అయితే, ఈ మ్యాచ్ లో పంత్ సాధించిన రికార్డులు ఏంటో చూద్దాం.
1. టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ వికెట్ కీపర్ రిషభ్ పంత్. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేయడం రికార్డు.
2. ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసిన రెండో వ్యక్తి రిషభ్ పంత్. అంతకు ముందు జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ 2001లో హరారేలో దక్షిణాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్ లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 199 పరుగులు చేయడం జరిగింది. రిషభ్ పంత్ ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఈ ఘనతను సాధించారు.
3. ఆసియా జట్లలోని వికెట్ కీపర్ల అందరి కన్నా ఎక్కువ సెంచరీలు చేసిన వ్యక్తి రిషభ్ పంత్. ఈ టెస్ట్ లో రెండు సెంచరీలు చేయడం ద్వారా రికార్డు సృష్టించారు. రిషభ్ ఈ టెస్ట్ సెంచరీలతో మొత్తం 8 సెంచరీలు చేయగా, శ్రీలంక వికెట్ కీపర్ సంగక్కర 7 సెంచరీలు, ధోనీ 6 సెంచరీలు చేశారు. వీరందరిని దాటి పంత్ తొలి స్థానంలో నిలిచారు.
4. ఇంగ్లండ్లో ఎక్కువ సెంచరీలు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన ఆయా దేశాల వికెట్ కీపర్లలో ఆండీ ఫ్లవర్ మాత్రమే ఇంగ్లీష్ గడ్డపై రెండు సెంచరీలు చేయడం విశేషం. ఇక రిషభ్ పంత్ మాత్రం ఏకంగా నాలుగు సెంచరీలు చేయడం విశేషం. ఈ తొలి టెస్ట్ లోనే రెండు ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీలు చేయడంతో ఈ రికార్డు విషయంలో మిగతా వికెట్ కీపర్లతో పోల్చితే చాలా ముందుండటం విశేషం.
5. SENA గడ్డపై ఎక్కువ సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ నిలిచారు. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ గడ్డపై సంయుక్తంగా (అంటే విదేశాల్లోను, స్వదేశంలో కలిపి) ఎక్కువ సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్ రిషభ్ పంత్. తొలి టెస్ట్ లో చేసిన రెండు సెంచరీలతో కలిపి ఈ దేశాలపై రిషభ్ పంత్ ఐదు సెంచరీలు చేశారు. పంత్ కన్నా ముందు ఆరు సెంచరీలతో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ ముందు ఉన్నారు. ఈ సిరీస్ లో మరీ రెండు సెంచరీలు చేస్తే SENA గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్ గా పంత్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.





















