అన్వేషించండి

Ambati Rayudu: మళ్లీ బ్యాటు పట్టనున్న రాయుడు,ఇంటర్నేషనల్‌ లీగ్‌లో బరిలోకి

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెట్‌ అంబటి రాయుడు మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్‌లో ఆదివారం ట్వీట్ చేశాడు. త్వరలో దుబాయ్‌(Dubai)లో జరుగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌(Indetnational T20 )లో ఆడనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించాడు. ఇంటర్నేషనల్‌ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. 
 
ట్వీట్‌ ఇదే...
 
వైఎస్సార్సీపీ నుంచి తప్పుకొంటున్నట్టు ట్వీట్‌ చేసిన తర్వాత  రాయుడు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించాడు. త్వరలో దుబాయ్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ2లో ముంబై తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నానని ఆ ట్వీట్‌లో తెలిపాడు. ప్రొఫెషనల్‌ ఆటలో ఆడేందుకు తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ లో వెల్లడించాడు. దుబాయ్‌ వేదికగా ఈ నెల 19 నుంచి ఐఎల్‌ టీ20 మొదలుకానుంది. ఫిబ్రవరి 17 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది.
 
అలా చేరాడు.. ఇలా వీడాడు..
డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఈ నెల 6న (శనివారం) తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేయడంతో అంతా షాకయ్యారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఏమైందీ.? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారని.. అయితే అది కేటాయించకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారని వార్తలు హల్చల్ చేశాయి. ఆయనకు మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేయగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, టీడీపీ సైతం అంబటి రాజీనామాపై స్పందించింది. 'జగన్ వంటి దుర్మార్గుడితో కలిసి మీరు మీ రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయత్నాల్లో మీకు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేస్తూ అంబటి రాయుడు ట్వీట్ ను ట్యాగ్ చేసింది. అధినేత చంద్రబాబు సైతం ఆదివారం తిరువూరు సభలో మాట్లాడుతూ.. అంబటి రాయుడు అంశంపై స్పందించారు. గుంటూరు ఎంపీ టికెట్ పేరుతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడును మోసగించారని, ఆ టికెట్ మరొకరికి ఇవ్వడంతో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించారని అన్నారు.
 
రఘురామ కౌంటర్‌
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) గురించి తెలుసుకునేందుకు తనకు ఆరు నెలలు సమయం పట్టిందని.... కానీ అంబటి రాయుడు ఆరు రోజుల్లోనే తెలుసుకున్నాడని అన్నారు ఎంపీ రాఘురామకృష్ణరాజు(Raghuramakrishna Raju). జగన్ వ్యక్తిత్వాన్ని ఇంత తొందరగా గ్రహించాడని.... వైఎస్‌ఆర్‌సీపీలో చేరి ఎంత తప్పుచేసాడో తెలుసుకున్నాడని అన్నారు. అందుకే... ఇలా చేరి.. అలా  బటయకు వచ్చాడని ఎద్దేవా చేశారు రఘురామ. వైఎస్‌ఆర్‌సీపీ మునిగిపోయే నావ లాంటిదని అంబటి రాయుడు తొందరగానే గుర్తించారన్నారు. అందుకే చేరిన వారం రోజుల్లోనే ఆ పార్టీని వీడారని చెప్పారు. చెడు గురించి ఇంత తొందరగా తెలుసుకున్న అంబటి రాయుడిని తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget