Sakibul Gani World Record: అరంగేట్రంలోనే అద్భుతం, రంజీల్లో ట్రిపుల్ సెంచరీతో సరికొత్త రికార్డ్
Sakibul Ghani Triple Century On First Class Debut: బిహార్‌కు చెందిన యువ ఆటగాడు సకిబుల్ గని అద్భుతం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
Sakibul Gani World Record: ఐపీఎల్ 2022 వేలం ముగియగానే క్రికెట్ ప్రేమికులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ రంజీ మ్యాచ్‌లు, వెస్టిండీస్‌తో టీమిండియా టీ20 సిరీస్‌ను ఆస్వాదిస్తున్నారు. రంజీల్లో శుక్రవారం నాడు అరుదైన రికార్డు నమోదైంది. బిహార్‌కు చెందిన యువ ఆటగాడు సకిబుల్ గని అద్భుతం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
మిజోరంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆట రెండో రోజు బిహార్‌కు చెందిన 22 ఏళ్ల సకిబుల్ గని ట్రిపుల్ సెంచరీ బాదడంతో చరిత్ర సృష్టించాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు సకిబుల్ గని. మోతిహరికి చెందిన సకిబుల్ 56 ఫోర్ల సాయంతో 341 పరుగులు చేశాడు. ఆర్జేడీకి చెందిన బిహార్‌కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తమ రాష్ట్రం యువ క్రికెటర్ సకిబుల్ గనిని అభినందించారు. రంజీల్లో హిస్టరీ క్రియేట్ చేశావని కొనియాడారు.
కోల్‌కతా వేదికగా మిజోరం జట్టుపై మ్యాచ్‌లో 405 బంతులాడిన సకిబుల్ గని ట్రిపుల్ సెంచరీతో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు అజయ్ రాజ్‌కుమార్ రొథెరా పేరిట ఉండేది. 2018లో 267 పరుగులతో అజయ్ రొథెరా నాటౌట్‌గా నిలిచాడు.
ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో టాప్ స్కోరర్లు వీరే..
1- 341 సకిబుల్ ఘని (2022)
2- 267* అజయ్ రొథెరా (2018)
3- 260 అమోల్ మజుందార్ (1994)
4- 256* బహీర్ షా (2017)
5- 240 ఎరిక్ మార్క్స్ (1920)
బబ్లూ కుమార్ డబుల్ సెంచరీ..
సకిబుల్ గనితో పాటు మరో ఆటగాడు బబ్లూ కుమార్ డబుల్ సెంచరీతో రాణించడంతో బిహార్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 686 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బబ్లూ కుమార్ 398 బంతుల్లో 229 పరుగులు చేశాడు. అయితే బిహార్ 71 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోగా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చారు. రెండో రోజు ముగిసేసరికి మిజోరం జట్టు 3 వికెట్లు నష్టపోయి 40 పరుగులు చేసి 646 పరుగుల వెనుకబడి ఉంది.
Also Read: IND vs WI, Match Highlights: సిరీస్ గెలిచేసిన టీమిండియా - 19వ ఓవర్లో భువీ మ్యాజిక్!
Also Read: SRH IPL 2022: ఇవేం వ్యూహాలు ఇదేం జట్టు - నేనుండనంటూ SRH కోచ్ రాజీనామా!