By: ABP Desam | Updated at : 14 Dec 2022 07:08 PM (IST)
Edited By: nagavarapu
అర్జున్ టెండూల్కర్ (source: twitter)
Arjun Tendulkar Century: 1988 డిసెంబర్ లో తన రంజీ అరంగేట్ర మ్యాచులో సచిన్ టెండూల్కర్ సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు అతని తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా అచ్చం తండ్రిలానే అరంగేట్ర రంజీ మ్యాచులో శతకం బాదాడు. ఇవి రెండు సంఘటనలు యాధృచ్ఛికమే అయినా అభిమానులు మాత్రం అర్జున్ ను తండ్రికి తగ్గ తనయుడంటూ పొగుడుతున్నారు. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన అరంగేట్ర రంజీ టోర్నీలో శతకం సాధించాడు. గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ తన ఫస్ట్ క్లాస్ సెంచరీని అందుకున్నాడు. రాజస్థాన్ పై 177 బంతుల్లో 100 పరుగులు చేశాడు.
గోవా 5 వికెట్లకు 201 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఏడో వికెట్ గా అర్జున్ టెండూల్కర్ క్రీజులోకి వచ్చాడు. 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 40వ ఓవర్ ముగిసే సరికి 112 పరుగులతో ఉన్నాడు. సుయూష్ ప్రభుదేశాయ్ (172 బ్యాటింగ్) తో కలిసి ఏడో వికెట్ కు అజేయంగా 205 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్జున్ ఈ ఏడాది గోవా తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ముంబయి నుంచి ఎన్ ఓసీ పత్రం తెచ్చుకుని రంజీ టోర్నీలో గోవాకు ఆడుతున్నాడు.
🚨 Like father, like son: Arjun Tendulkar scores century on Ranji Trophy debut pic.twitter.com/eWbQHSX0nJ
— MegaNews Updates (@MegaNewsUpdates) December 14, 2022
అర్జున్ టెండూల్కర్ ముంబై తరఫున ఆడేవాడు. అయితే ఈ సీజన్ లో గోవా తరపున విజయ్ హజారే ఇంకా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను ఆడాడు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ మరియు మీడియం-పేసర్ అయిన అర్జున్ 8 లిస్ట్ ఏ గేమ్‌లలో 8 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరఫున మూడు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.
గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ అర్జున్‌ని జట్టులో చేర్చింది. అయితే అతను తుది జట్టులో లేడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ ను వేలంలో కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ టెండూల్కర్ గోవా తరఫున ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. అందుకే మమ్మల్ని సంప్రదించాడు. అందుకు ముందు ఎంసీఏ నుంచి నిరభ్యంతర పత్రం పొందమని మేం చెప్పాం. అతనిని ఎంపిక చేసేముందు ఫిట్ నెస్, స్కిల్ టెస్ట్ లాంటి ప్రక్రియను అనుసరించాం. అని గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ విపుల్ ఫడ్కే తెలిపారు.
Wow Father - Son of Coincidence:
— KARTHIK DP (@dp_karthik) December 14, 2022
On 1988 December, @sachin_rt scored his hundred on Ranji debut.
In 2022 December, #ArjunTendulkar scored his hundred on Ranji debut. pic.twitter.com/UTTI0Tz6mv
Ganguly on Cricket WC 2023: ఇదే జట్టుతో నిర్భయంగా ఆడండి- ప్రపంచకప్ మనదే: గంగూలీ
Shortest Test Match: 61 బంతుల్లోనే ముగిసిన టెస్ట్ మ్యాచ్ - 25 ఏళ్ల కింద ఇదే రోజు ఏం జరిగింది?
Rishabh Pant: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని బాగా మిస్ అవుతాం: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్
U-19 womens WC Final: అమ్మాయిలు సాధిస్తారా! నేడే మహిళల అండర్- 19 టీ20 ప్రపంచకప్ ఫైనల్
Shahid Afridi: మరో రికార్డు వేటలో రోహిత్ - అఫ్రిదిని దాటగలడా?
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్