Aaryavir Sehwag and Anvay Dravid: అండర్ 16లో ద్రవిడ్- సెహ్వాగ్ తనయుల పోరు, పైచేయి ఎవరిదంటే..?
Aaryavir Sehwag and Anvay Dravid: ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్న ద్రవిడ్.... మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుల పోరుతో మిజయ్ మర్చంట్ ట్రోఫీ ఉత్కంఠభరితంగా సాగుతోంది.
అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీ అరుదైన పోరుకు సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల తనయుల పోరుతో ఈ టోర్నమెంట్ ఆసక్తికరంగా మారింది. ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్న ద్రవిడ్.... మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుల పోరుతో మిజయ్ మర్చంట్ ట్రోఫీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక అండర్–16 జట్టు కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ రెండో తనయుడు అన్వయ్ ద్రవిడ్... ఢిల్లీ అండర్–16 జట్టు ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ బరిలోకి దిగారు. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్-16 టోర్నీలో ఢిల్లీతో కర్ణాటక తలపడింది.
మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఢిల్లీ తరపున ఓపెనర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నాడు. మూడు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 56.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. అయితే వికెట్ కీపర్, కెప్టెన్ అన్వయ్ డకౌటయ్యాడు. అన్వయ్‌ను ఆయుష్ లక్రా అవుట్ చేశాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. అయితే, ఓపెనింగ్‌లోనే సెహ్వాగ్ తనయుడు అర్ధ సెంచరీ చేశాడు. తొలిరోజు 50 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ 98 బంతుల్లో 8 బంతుల్లో 54 పరుగులు చేశాడు. తొలిరోజు ఆటలో ద్రవిడ్ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్ పైచేయి సాధించాడు.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసిందని, ఆయన స్థానంలో కొత్త కోచ్ వస్తారని ప్రచారం జరుగుతుండగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోచ్, సపోర్ట్ స్టాఫ్ పై అధికారిక ప్రకటన చేసింది. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా కొనసాగుతారని, అదే విధంగా సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ ను బీసీసీఐ పొడిగించింది. బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం.. టీమిండియా (Team India) హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కొనసాగనున్నారు. అయితే ఎంతవరకూ వీరు పదవిలో కొనసాగుతారనేది బీసీసీఐ వెల్లడించలేదు. పరిస్థితి గమనిస్తే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ నకు వీరే సేవలు అందించేలా కనిపిస్తోంది.
రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా టీమిండియా వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ చేరింది. మరోవైపు ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ హెడ్ కోచ్ గా ద్రావిడే ఉండాలని, మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు పదే పదే కోరడంతో చివరకు ఒకే చెప్పాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ కూడా ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉండాలని కోరడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని హెడ్ కోచ్ గా కొనసాగేందుకు అంగీకరించాడు. హెడ్ కోచ్ ద్రావిడ్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను సైతం పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.