Rahul Dravid rested: టీమ్‌ఇండియా కోచింగ్ నుంచి రాహుల్ ద్రవిడ్‌కు రెస్ట్!
Rahul Dravid rested: టీమ్‌ఇండియా కోచింగ్ బాధ్యతలకు రాహుల్ ద్రవిడ్ కొన్నాళ్లు విరామం ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం లేదని తెలిసింది.
Rahul Dravid rested: టీమ్‌ఇండియా కోచింగ్ బాధ్యతలకు రాహుల్ ద్రవిడ్ కొన్నాళ్లు విరామం ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం లేదని తెలిసింది. కొన్ని రోజులు కుటుంబంతో గడిపి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు. దాంతో న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌కు ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఉంటాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్‌ఇండియా కథ ముగిసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో హిట్‌మ్యాన్ సేన ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బలహీనమైన బౌలింగ్ అటాక్‌తో వికెట్లు తీయలేక చతికిల పడింది. ఈ మెగా టోర్నీ తర్వాత భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. నవంబర్ 18 నుంచి 30 వరకు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ సిరీసుల్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ నేరుగా భారత్‌కే రానున్నారు.
'వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోనే సహాయ బృందం న్యూజిలాండ్ బయల్దేరనుంది. హృషికేశ్ కనిత్కర్ (బ్యాటింగ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్) వీవీఎస్‌కు తోడుగా ఉంటారు' అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. టీమ్‌ఇండియాకు వీవీఎస్ కోచింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్ సిరీసుల్లో ఈ బాధ్యతలు నిర్వహించాడు. ద్రవిడ్ విశ్రాంతి తీసుకొనేందుకు సహకరించాడు.
టీ20 సిరీసుకు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18న వెల్లింగ్టన్, 20న మౌంట్ మాంగనూయ్, 20న నేపియర్‌లో పొట్టి క్రికెట్ పోటీలు ఉంటాయి. వన్డే సిరీసుకు శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేస్తాడు. నవంబర్ 25న ఆక్లాండ్, 27న హ్యామిల్టన్, 30న క్రైస్ట్ చర్చ్‌లో వన్డేలు జరుగుతాయి. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటిస్తుంది. ఇందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ అందుబాటులో ఉంటారు.
IND vs ENG Semi Final Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్‌ఇండియా కథ ముగిసింది! 15 ఏళ్ల ఎదురు చూపులు ఫలించలేదు. ఐసీసీ ట్రోఫీ కోసం 130 కోట్ల మంది భారతీయులు మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే! అడిలైడ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఓటమి చవిచూసింది. 169 పరుగులను డిఫెండ్ చేసుకోలేక తెల్లముఖం వేసింది. కనీసం ఒక్క వికెట్టైనా పడగొట్టలేక అవమానం మూటగట్టుకుంది. మరోవైపు ఈ టార్గెట్‌ను ఇంగ్లాండ్ సునాయాసంగా ఛేదించింది. 16 ఓవర్లకే 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పాకిస్థాన్‌తో బిగ్ ఫైనల్ ఆడేందుకు మెల్‌బోర్న్‌కు దూసుకెళ్లింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (80; 49 బంతుల్లో 9x4, 3x6), అలెక్స్ హేల్స్ (86; 47 బంతుల్లో 4x4, 7x6) టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు. అంతకు ముందు విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్ పాండ్య (63; 33 బంతుల్లో 4x4, 5x6) రాణించారు.