అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rahul Dravid: టీ 20 ప్రపంచకప్ పైకెత్తి, రాహుల్ ద్రావిడ్ విజయగర్జన
T20 World Cup 2024 : టీం ఇండియా అద్భుతం సృష్టించింది. అపూర్వ విజయాన్ని అందుకుంది. కప్ ను అందుకున్న రాహుల్ ద్రావిడ్ ఆనందంతో విజయ గర్జన చేశాడు.
![Rahul Dravid: టీ 20 ప్రపంచకప్ పైకెత్తి, రాహుల్ ద్రావిడ్ విజయగర్జన Rahul Dravid Lost World Cup 2007 As Captain Won 2024 As Coach T20 World Cup 2024 Final IND vs SA Rahul Dravid: టీ 20 ప్రపంచకప్ పైకెత్తి, రాహుల్ ద్రావిడ్ విజయగర్జన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/49dd7c1503140d338b1865a61977225b17196887226181036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విజయానందంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Photo Source: Twitter/@BCCI/@DelhiCapitals )
Rahul Dravid Emotional : టీ 20 ప్రపంచకప్(T20 World Cup) గెలిచిన అనంతరం ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. రోహిత్ శర్మ కప్పును అందుకున్న అనంతరం జట్టు సభ్యులంతా సందడి చేశారు. రోహిత్ స్టెప్పులేస్తూ వచ్చి టీ 20 ప్రపంచక్‌ను అందుకోగా.... అనంతరం ఆటగాళ్ల సందడి మాములుగా లేదు. ఈ సంబరాలు అన్నీ అయిపోయాకే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ... టీ 20 ప్రపంచకప్‌ను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు అందించాడు. ఆటగాళ్లంతు చుట్టూ చేరి చూస్తుండగా రాహుల్ ద్రావిడ్ కప్పు పైకెత్తి విజయ గర్జన చేశాడు. దీనికోసమే కదా ఇన్నేళ్లు శ్రమపడ్డది అనేలా టీమిండియా హెడ్ కోచ్ ఆ క్షణాలను భావోద్వేగంతో ఆస్వాదించాడు.
Rahul Dravid finally unleashed all his emotions.. this is a moment too! pic.twitter.com/52Pb3uHHDV
— Keh Ke Peheno (@coolfunnytshirt) June 29, 2024
Rahul Dravid showing emotion.Ive seen it all. pic.twitter.com/rdaC3JqoKX
— R🖤 (@findgoddd) June 29, 2024
ప్రపంచమంతా చూసింది
ఈ పొట్టి వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఉత్కంఠగా క్రికెట్ ప్రపంచం చూసింది. టీమిండియా ఆడుతున్నప్పుడు మైదానంలో వెస్టిండీస్ అభిమానులు కూడా టీమిండియాకు మద్దతు పలికారు. ఫలితం వచ్చాక మంచి మ్యాచ్ చూశామని చాలామంది వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌లో గెలిచి మరోసారి టీ 20 ప్రపంచకప్‌ను టీమిండియా ఒడిసిపట్టింది. కోట్లాది మంది అభిమానుల అంచనాలను నిజం చేస్తూ రోహిత్ సేన విజయం సాధించింది. దశాబ్దం నాటి కలను సాకారం చేసుకుంది. టీమిండియాలోని ప్రతీ ఆటగాడు ఫైనల్లో పట్టుదలతో ఆడాడు. కోహ్లీ మంచి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion