అన్వేషించండి
Advertisement
Virat Kohli: విరాట్ ఇగోతో ఆడుకోండి, కవ్వించండి - ఫలితం రాబట్టండి
Virat Kohli: ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తన జట్టుకు కొన్ని కీలక సూచనలు చేశాడు. స్వదేశంలో విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్‌లో ఉంటాడని, అతడిని ఔట్ చేయాలంటే రెచ్చగొట్టడమొక్కటే మార్గమన్నాడు.
సాధారణంగా ఏ జట్టు అయినా విరాట్ కోహ్లీని రెట్టగొట్టదని అలా రెచ్చగొడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తుంటుంది. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రేమ్ స్వాన్ ఇంగ్లీష్ జట్టును హెచ్చరించాడు.ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లిని స్లెడ్జింగ్ చెయ్యొద్దని.. ఆలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తమ జట్టును స్వాన్ హెచ్చరించాడు. దాదాపు అన్ని జట్లు ఇలాగే తమ సభ్యులను హెచ్చరిస్తుంటాయి. ఎందుకంటే కోహ్లీని ఒకసారి స్లెడ్జింగ్ చేస్తే చెలరేగిపోతాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టిస్తాడు. కానీ తాజాగా
ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్(Monty Panesar)... తన జట్టుకు దీనికి విరుద్దంగా కొన్ని కీలక సూచనలు చేశాడు. స్వదేశంలో విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్‌లో ఉంటాడని, అతడిని ఔట్ చేయాలంటే రెచ్చగొట్టడమొక్కటే మార్గమన్నాడు.
మాంటీ ఏమన్నాడంటే..?
ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో మైండ్ గేమ్స్ ఆడాలని, అతడి ఈగోపై దెబ్బ కొట్టాలని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes)కు పనేసర్ సూచించాడు. విరాట్‌తో మైండ్ గేమ్స్ ఆడాలని... అతడిని మానసికంగా దెబ్బతీయాలని పనేసర్ సూచించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ మీదే దృష్టి సారించాలన్న పనేసర్... అతడి ఇగోతో ఆడుకోవాలని...కోహ్లీని స్లెడ్జ్ చేయడానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు మొహమాటపడాల్సిన అవసరమేమీ లేదని సూచించాడు. కోహ్లీ స్వదేశంలో ఆడుతున్నప్పుడు బీస్ట్ మోడ్‌లో ఉంటాడని... .అతడిని అవుట్ చేసేందుకు స్లెడ్జింగ్ మార్గమని అన్నాడు. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదని.... ఫైనల్‌లో ఓడిపోయే చోకర్స్’ అని అరవాలని కూడా సూచించాడు. గత 10 ఏళ్లగా ఐసీసీ టైటిల్స్‌ను గెలవకపోయిన విషయాన్ని అతడికి పదేపదే గుర్తు చేయాలని సూచించాడు. అప్పుడు విరాట్ తన ఏకగ్రాతను కోల్పోతాడుయ దీంతో అతడిని అవుట్ చేయడం సులభం అవుతుందని పనేసర్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌లో కోహ్లికి, ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్‌కు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని పనేసర్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీకి మెరుగైన రికార్డు
ఇంగ్లండ్‌పై కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఆ జట్టుపై 28 టెస్టులు ఆడిన విరాట్.. 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు. మరో 9 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌పై టెస్టులలో కోహ్లీ 2 వేల పరుగులు పూర్తవుతాయి. అంతేగాక మరో 152 పరుగులు చేస్తే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అతడు 9వేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్ అవుతాడు. ప్రస్తుతం కోహ్లీ.. 113 టెస్టులు ఆడి 191 ఇన్నింగ్స్‌లలో 8,848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 30 అర్థ సెంచరీలున్నాయి.
కొత్త వ్యూహంతో ఇంగ్లండ్
స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లిష్ టీమ్(Team England)కు సారథ్యం వహించనుండగా.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, జో రూట్‌తో పాటు బెయిర్‌స్టో, బ్రూక్, క్రాలీ, డకెట్, ఫోక్స్, లీచ్, పోప్, రాబిన్‌సన్, మార్క్ వుడ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. 16 మందితో కూడిన జట్టు ఎంపికలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పలు అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. టామ్ హార్డ్లీ, గట్కిన్సన్, షోయబ్ బాషిర్ టెస్టులోకి అరంగేట్రం చేయనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion