అన్వేషించండి

Inzamam ul Haq: సంక్షోభంలో పాకిస్థాన్‌ క్రికెట్‌?, ఇంజమామ్‌ సంచలన వ్యాఖ్యలు

Pakistan Cticket News: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ 20 ప్రపంచ కప్ లో మొదట్లోనే విఫలం అవ్వటంపై అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా పాక్ వెటరన్ ఆటగాడు ఇంజమామ్‌ ఉల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Inzamam ul Haq about PAkistan Cricket team: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) లో పాక్‌ టీమ్ లీగ్‌ దశలోనే వెనుదిరిగడం ఆ దేశ క్రికెట్‌ పాతాళానికి పడిపోతుందనడానికి సంకేతమా..? పాక్‌ (Pakistan) జట్టు మరో వెస్టిండీస్‌, శ్రీలంక జట్ల తరహాలో పూర్తిగా పతనం కానుందా.? ప్రపంచకప్‌నకు ముందు ఐర్లాండ్‌... వరల్డ్‌కప్‌లో అమెరికా చేతిలో ఓటములు ఏం సంకేతాలు ఇస్తున్నాయ్‌..? ఆ దేశ మాజీ ఆటగాళ్ల తీవ్ర ఆందోళన వెనుక కారణమేంటీ ? పాక్‌ దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇంత బాధపడటం దేనికి సంకేతం..?  జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లందరినీ జట్టులోంచి పీకి పారేయండంటూ దిగ్గజ ఆటగాళ్లు చేస్తున్న తీవ్ర విమర్శల్లో ఆంతర్యం ఏంటి..? పాక్‌ క్రికెట్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోనుందా ? జట్టులోని పది మంది ఆటగాళ్ల ఆటను తాను ఆడలేను కదా అన్న కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్ నిర్వేదం వెనుక ఉన్న లోతు ఎంత..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. తాజాగా పాక్‌ దిగ్గజ ఆడగాడు ఇంజమామ్‌ ఉల్‌ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.
 
పాక్‌ ప్రదర్శన ఇలా...   
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే ఓటమి... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో ఓటములు... టీ 20 ప్రపంచకప్‌లోనూ లీగ్‌ దశలోనే ఓటమి ఇవీ పాకిస్థాన్‌ తాజా పరిస్థితులు. వరుసగా వైఫల్యాలు వెంటాడుతుండడం ఆ దేశ క్రికెట్‌నే సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయి. పాక్‌ ఆర్మీతో శిక్షణ ఇచ్చినా తమ జట్టు ఆటలో ఇసుమంతైనా మార్పు లేకపోవడం అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాళ్లను కలవరపెడుతోంది. భారత్ ఏడు, అమెరికా ఐదు పాయింట్లతో గ్రూప్‌ ఏ నుంచి సూపర్‌ ఎయిట్‌ చేరగా... పాక్‌ మొదటిసారి గ్రూప్ దశ నుంచే వైదొలిగింది. 
 
ఇంజీ సంచలన వ్యాఖ్యలు
తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(Inzamam ul Haq)... టీ 20 ప్రపంచ కప్‌లో తమ జట్టు ప్రదర్శనపై  స్పందించాడు. అమెరికా, భారత్ చేతిలో ఓడి పాక్‌ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.  పాక్‌ జట్టులో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇంజీ భాయ్‌ తెలిపాడు. పాక్‌ జట్టు ప్రదర్శన క్షీణిస్తున్నట్లు అంగీకరించాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్‌కు తీవ్రమైన పోటీదారుగా భావించిన ఇంజిమామ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవును పాక్‌ క్రికెట్‌ క్షీణిస్తోందని ఇంజీ భాయ్‌ తెలిపాడు. అవును తమ దేశ క్రికెట్‌ క్షీణిస్తోందని... అమెరికాపై ఓడిపోవడం తనను షాక్‌కు గురిచేసిందని అన్నాడు. ప్రపంచకప్‌నకు ముందు కూడా ఐర్లాండ్‌ చేతిలో పాక్‌ ఓడిపోయిందని కూడా ఇంజీ గుర్తు చేశాడు.
 
స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో కూడా పాక్‌ ఓడిపోయిందని ఈ ఓటములన్నీ తమ జట్టు క్షీణిస్తుందనేందుకు నిదర్శనమని ఇంజీ కుండబద్దలు కొట్టాడు. T20 ప్రపంచ కప్ లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇప్పుడు పాక్ సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లపై ప్రభావం పడే ఆవకాశం ఉంది. కొందరు ఆటగాళ్లకు మళ్లీ సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇవ్వడంపై మళ్లీ సమీక్ష జరపాలని కొంతమంది అధికారులు, మాజీ ఆటగాళ్ళు పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సలహా ఇచ్చారని తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget