అన్వేషించండి
Sehar Shinwari: భారత్‌ను ఓడిస్తే డేట్‌కి వస్తా, బంగ్లాదేశ్ టీంకి పాకిస్థాన్ నటి బంపరాఫర్
ODI World Cup 2023: బంగ్లాదేశ్ క్రికెటర్లకు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి బంపరాఫర్ ప్రకటించింది. టీమిండియాను ఓడిస్తే బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేటింగ్‌కు వెళ్తానంటూ ప్రకటించిన పాకిస్థానీ ముద్దుగుమ్మ.
![Sehar Shinwari: భారత్‌ను ఓడిస్తే డేట్‌కి వస్తా, బంగ్లాదేశ్ టీంకి పాకిస్థాన్ నటి బంపరాఫర్ Pakistani actress Sehar Shinwari wows to have dinner with Bangladeshi cricketer if they defeat India in the ICC World Cup match gets trolled Bakwas Sehar Shinwari: భారత్‌ను ఓడిస్తే డేట్‌కి వస్తా, బంగ్లాదేశ్ టీంకి పాకిస్థాన్ నటి బంపరాఫర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/261dab6565a685fbfe5f00e70de3f0ac1697680266503872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బంగ్లాదేశ్ క్రికెటర్లకు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి బంపర్ ఆఫర్ ( Image Source : Twitter )
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయాన్ని ఆ జట్టు మేనేజ్‌మెంట్, అభిమానులు, ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిస్ సేన ధాటికి దాయాది జట్టు కనీసం పోటీ కూడా ఇవ్వకుండా బొక్కబొర్లా పడడంపై పాపం పాక్‌లోని కొందరు అభిమానులు రగిలిపోతున్నారు. టీమిండియా ఓడిపోవాలన్న అసూయతో ఉన్నారు.
ఇప్పటికే పాక్ డైరెక్టర్ మిక్కీ అర్థర్ అహ్మాదాబాద్ అభిమానుల ప్రవర్తనపై అక్కసు వెళ్లగక్కగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ జాబితాలోకి పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సెహర్ షిన్వారి కూడా చేరింది. బంగ్లాదేశ్ క్రికెటర్లకు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి బంపరాఫర్ ప్రకటించింది. టీమిండియాను ఓడిస్తే బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేటింగ్‌కు వెళ్తానంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది ఈ పాకిస్థానీ ముద్దుగుమ్మ. ఇండియా ఓటమిలో కీలకపాత్ర పోషించే బంగ్లా క్రికెటర్‌తో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్తానంటూ ట్విటర్‌లో ట్వీట్ చేసింది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పూర్తైన మరుసటి రోజు అక్టోబర్ 15న షెన్వారీ ఈ ప్రకటన చేయగా ఇప్పుడు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డేట్‌కు వస్తా
ఇవాళ(గురువారం) జరిగే మ్యాచ్‌లో టీమిండియాను ఓడించాలంటూ బంగ్లా ఆటగాళ్లను కోరింది. భారత్‌ను ఓడిస్తే ఆ మ్యాచ్‌లో రాణించిన ఆటగాడితో డేట్‌కు వెళతానంటూ బంపరాఫర్ ఇచ్చింది. ‘ ఇన్షా అల్లాహ్.. భారత్‌తో ఆడే మ్యాచులో మా బంగ్లా బంధువులు ప్రతీకారం తీర్చుకుంటారని ఆశిస్తున్నాను. బంగ్లాదేశ్ జట్టు, భారత్‌ని ఓడించగలిగితే ఢాకాకి వెళ్తా. అక్కడ బెంగాలీ బాయ్‌తో ఫిష్ డిన్నర్ డేట్ చేస్తా అని సెహర్ షిన్వారి ట్వీట్ చేసింది.
గతంలోనూ అంతే
షిన్వారి ఇలాంటి స్టేట్‌మెంట్లు చేయడం ఇదే తొలిసారి ఏమీ కాదు. గతంలోనూ ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ప్రకటనలే చేసి రచ్చ చేసింది. ఇటీవల ఆసియా కప్‌లో ఇండియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన సమయంలోనూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మీద కేసు పెడతానంటూ షిన్వారి సంచలన ట్వీట్ చేసింది. ఇక షిన్వారి గతంలో చేసిన ట్వీట్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. బాబర్‌పై కేసు పెట్టుకో పో అని కొందరు... గతంలో చెప్పిన మాటలు ఏమయ్యాయని మరికొందరు ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో ఓసారి ట్విటర్ వదిలేసి వెళ్లావ్ గుర్తులేదా.. అబద్దాలు చెప్తున్నావ్ అంటూ మరికొందరు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. మరోసారి నీ బుద్ధి చూపించుకన్నావుగా’.. ‘మీ పాకిస్థాన్ జట్టు వల్లే కాలేదు ఇక బంగ్లాదేశ్‌తో అవుతుందా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో టీమిండియాతో పాకిస్తాన్ మరోసారి తలపడాలంటే.. ఆ జట్టు సెమీస్ కు చేరాలి.
భారత జైత్రయాత్ర ఇలా...
ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. టోర్నీలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా 6 వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ పరుగుల ఛేజింగ్‌లో విజయం సాధించడం విశేషం. రోహిత్ సేన న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తదుపరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion