Asia Cup 2025 Pak Vs SL Result Update: లంక ఔట్..! పాక్ చేతిలో ఓటమితో ఫైనల్ ఛాన్స్ క్లిష్టం.. డూ ఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటిన పాక్.. రాణించిన ఆఫ్రిది, తలత్, నవాజ్
ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ సత్తా చాటింది. అన్ని విభాగాల్లో సత్తా చాటి, లంకను చిత్తు చేసింది. తాజా ఓటమితో లంక ఈ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించిందని తెలుస్తోంది.

Asia Cup 2025 Pak win vs SL In Super 4: ఆసియాకప్ 2025లో గత ఎడిషన్ రన్నరప్ శ్రీలంక ప్రస్తానం దాదాపుగా ముగిసింది. చావో రేవోలాంటి మ్యాచ్ లో పాక్ చేతిలో 5 వికెట్లతో పరాజయం పాలైంది. మంగళవారం దుబాయ్ లో జరిగిన సూపర్- 4 మ్యాచ్ లో టాస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక.. బ్యాటింగ్ వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ కమిందు మెండిస్ సూపర్బ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 50, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షాహిన్ షా ఆఫ్రిదికి మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ను 18 ఓవర్లలోనే 5 వికెట్లకు 138 పరుగులు చేసి పాక్ పూర్తి చేసింది. ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్ (24 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యాతాయుత ఇన్నింగ్స్ తో చివరికంటా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బౌలర్లలో మహీషా తీక్షణ, వనిందు హసరంగాకు రెండేసి వికెట్లు దక్కాయి. తాజా ఓటమితో లంక టోర్నీ నుంచి దాదాపు నాకౌట్ కాగా, ఫైనల్ ఆశలను మాత్రం పాక్ సజీవంగా ఉంచుకుంది. బుధవారం భారత్, బంగ్లాదేశ్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగుతుంది.
Pakistan prevail in a closely-contested game! ✌️
— AsianCricketCouncil (@ACCMedia1) September 23, 2025
Having lost their way briefly in the middle overs, 🇵🇰 did incredibly well to keep a calm head and chase down the target & get a W against their name. 😎#PAKvSL #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/hWFvjlMMoc
వణికించి ఆఫ్రిదీ..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంకను షాహిన్ షా ఆఫ్రిదీ దెబ్బ తీశాడు. ఆరంభంలోనే ఓపెనర్లు పతుమ్ నిసాంక (8), వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ డకౌట్ తో పెవిలియన్ కు పంపాడు. దీంతో 18 పరుగులకే ఓపెనర్ల వికెట్లను లంక కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ చరిత్ అసలంక (20) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ లో మాత్రం కమిందు.. ఒంటరి పోరాటం చేశాడు. వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అతనికి వనిందు హసరంగా (15), చమ్మిక కరుణరత్నే (17 నాటౌట్) చక్కని సహకారం అందించారు. ముఖ్యంగా కరుణరత్నే తో కలిసి 7వ వికెట్ కు 43 పరుగులను కమిందు నమోదు చేశాడు. ఈ క్రమంలో 43 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మిగతా బౌలర్లలో హరీస్ రవూఫ్, హుస్సేన్ తలత్ కు రెండేసి వికెట్లు దక్కాయి.
తలత్ ఆల్ రౌండ్ షో..
ఛేజింగ్ లో తలత్ జట్టును ఆదుకున్నాడు. బౌలింగ్ లో రెండు వికెట్లను తీసిన తలత్.. బ్యాటింగ్ లో అజేయంగా నిలిచి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు చిన్న టార్గెట్ ఛేజింగ్ లో పాక్ తడబడింది. టాప్, మిడిలార్డర్ తడబడటంతో ఒకదశలో 80 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తలత్ (32 నాటౌట్) తో కలిసి నవాజ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ముఖ్యంగా హసరంగా బౌలింగ్ లో వరుసగా ఫోర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అదే జోరులో అబేధ్యమైన ఆరో వికెట్ కు 58 పరుగులు జోడించాడు. దీంతో పాక్ విక్టరీని ఖాయం చేసుకుంది.




















