అన్వేషించండి

PAK VS AFG: పాక్‌ బ్యాటర్లకు అఫ్గాన్‌ స్పిన్‌ సవాల్‌

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన పాకిస్థాన్‌కు అసలైన సవాల్‌ ఎదురుకానుంది. సెమీస్‌ రేసులో ఇంకా వెనకబడకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ ఇది.

ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన పాకిస్థాన్‌కు అసలైన సవాల్‌ ఎదురుకానుంది. సెమీస్‌ రేసులో ఇంకా వెనకబడకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్‌తో పాకిస్థాన్‌తో తలపడనుంది. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అసలే స్పిన్‌కు స్వర్గధామంగా ఉండే చెపాక్‌ పిచ్‌పై పటిష్టంగా ఉన్న అఫ్ఘాన్‌ బౌలర్లను పాక్‌ బ్యాట్స్‌మెన్లు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు షాక్‌ ఇచ్చిన అఫ్గాన్ జట్టు.. ఇప్పుడు పాక్‌కు కూడా షాక్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఇటు వరుసగా రెండు మ్యాచుల ఓటమితో ఉన్న పాకిస్థాన్‌ కూడా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. స్పిన్‌ పిచ్‌పై అఫ్గాన్ బౌలర్లకు..పాక్‌ బ్యాటర్లకు మధ్య అసలు సిసలైన సమరం జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే అఫ్గాన్‌ బౌలర్లు సత్తా చాటుతున్నారు. కాబట్టి ఏ మాత్రం అలసత్వం ఆవహించినా పాక్‌కు షాక్‌ తప్పకపోవచ్చని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. 
 
పాక్‌కు స్పిన్‌ తలనొప్పి
టీమిండియా, ఆస్ట్రేలియాపై వరుసగా రెండు పరాజయాల తర్వాత బాబర్ అజామ్ సేనకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ మ్యాచ్‌ ఓడిపోతే ఈ మెగా టోర్నమెంట్‌లో సెమీస్‌ చేరాలన్న పాకిస్థాన్‌ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. ప్రస్తుతం పాక్‌ నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కానీ పాక్‌ రన్‌రేట్‌ మైనస్‌ 0.456 ఉండడం వారిని ఆందోళన పరుస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవాలని బాబర్‌ సేన కోరుకుంటోంది. కానీ స్పిన్నర్లను ఎదుర్కోవడంతో పాక్‌ తిప్పలు పడుతోంది. బ్యాటింగ్‌కు అనుకూలించిన బెంగళూరు చిన్నస్వామి పిచ్‌పై ఆస్ర్లేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా నలుగురు పాక్‌ బ్యాటర్లను అవుట్‌  చేశాడు. ఆ మ్యాచ్‌లో జంపా బౌలింగే పాక్‌కు గెలుపును దూరం చేసింది. జంపా బౌలింగ్‌లో తడబడ్డ పాక్‌ బ్యాటర్లు.. రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్  వంటి ఉత్తమ అఫ్గాన్‌ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
 
బాబర్‌ రాణిస్తాడా..?
ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్‌ రాలేదు. అఫ్గాన్‌పై మ్యాచ్‌లోనైనా బాబర్‌ రాణించాలని పాక్‌ కోరుకుంటోంది. 294 పరుగులతో ప్రస్తుత ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్న మహ్మద్ రిజ్వాన్‌పై పాక్‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో పాక్‌ బౌలింగ్‌ స్థాయికి తగ్గట్లు లేదు. షాహీన్ షా అఫ్రిది ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. అతనొక్కడే మెరుగ్గా రాణిస్తున్నాడు. హరీస్ రవూఫ్, హసన్ అలీల ఫామ్ పాక్‌ను ఆందోళనపరుస్తోంది. 
 
అఫ్ఘాన్‌ మరో సంచలనం సృష్టిస్తుందా
పాక్‌పై మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో మరో సంచలనం సృష్టించాలని అఫ్ఘానిస్తాన్ 
పట్టుదలతో ఉంది. అఫ్గాన్‌ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మినహా మరే బ్యాటర్‌ కూడా ఈ టోర్నమెంట్‌లో పెద్దగా రాణించలేదు. ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హష్మతుల్లా షాహిదీలపై భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని అఫ్గాన్‌ కోరుకుంటోంది. వన్డేల్లో ఇప్పటివరకు పాక్‌-అఫ్గాన్‌ ఏడు వన్డేల్లో తలపడగా ఏడింట్లోనూ పాకిస్థానే గెలిచింది. కొన్నేళ్లుగా పాక్‌-అప్ఘాన్‌ మధ్య కొంత ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలిచేందుకు శతవిధాల ప్రయత్నిస్తాయని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. 
 
పాకిస్థాన్‌ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ , షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ వాసిమ్. 
 
అఫ్ఘానిస్థాన్‌ జట్టు:
హష్మతుల్లా షాహిదీ ( కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్, ముజీబ్, ఫజల్హక్ ఫరూకీ, అబ్దుల్ రెహమాన్, నవీన్ ఉల్ హక్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget