Naseem Shah: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ - ఇంతవరకు ఎవరూ చేయని విధంగా!
పాకిస్తాన్ బౌలర్ నసీం షా కొత్త రికార్డు సృష్టించాడు.
![Naseem Shah: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ - ఇంతవరకు ఎవరూ చేయని విధంగా! PAK vs NZ: Naseem Shah created history in his fifth ODI Naseem Shah: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ - ఇంతవరకు ఎవరూ చేయని విధంగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/10/0dc86133eb3b00fee24f3992a1cc30ad1673335453467366_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 11న జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 79 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
కానీ నసీమ్ షా మాత్రం ఒక రికార్డును సాధించడంలో సఫలమయ్యాడు. తన ఐదో వన్డేలో ప్రపంచంలోని ఎందరో దిగ్గజాలను దాటేశాడు. తన మొదటి ఐదు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నసీమ్ నిలిచాడు.
గత ఐదు వన్డేల్లో నసీమ్ ప్రదర్శన
నసీమ్ షా 2022 ఆగస్టు 16వ తేదీన నెదర్లాండ్స్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత తను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో నసీమ్ రెండో వన్డేలో రెండు, మూడో వన్డేలో ఐదు, నాలుగో వన్డేలో ఐదు, ఐదో వన్డేలో మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ కాలంలో నసీమ్ షా నెదర్లాండ్స్ , న్యూజిలాండ్‌లతో మాత్రమే వన్డేలు ఆడాడు. తొలి ఐదు వన్డేల్లో 18 వికెట్లు తీశాడు. తొలి ఐదు వన్డేల్లో ప్రపంచంలో ఏ బౌలర్ కూడా 18 వికెట్లు తీయలేకపోయాడు. ఐదు వన్డేల్లో 18 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నసీమ్ నిలిచాడు.
నసీమ్ షా తన మొదటి ఐదు వన్డేల్లో 18 వికెట్లు తీయడం ద్వారా ర్యాన్ హారిస్, గ్యారీ గిల్మర్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లను దాటేశాడు. తొలి 5 వన్డేల్లో ర్యాన్ హ్యారీ 17 వికెట్లు పడగొట్టాడు. గ్యారీ గిల్మోర్ 5 వన్డేల్లో 16 వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన ఐదు ఓపెనింగ్ వన్డేల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు వన్డేల్లో తన బౌలింగ్‌లో నిలకడను కొనసాగించడం నసీమ్ షా ప్రత్యేకత. పాకిస్థాన్ తరఫున ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ వికెట్లు తీశాడు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)