అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Rohit sharma News: మా విజయ రహస్యం అదే, ఇకపై అదే వ్యూహం అమలు చేస్తాం
ODI World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమన్నదే ఎరగకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో సాధికార విజయాలతో నాకౌట్ దశకు చేరింది.
Rohit Sharma Latest News Today: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమన్నదే ఎరగకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో సాధికార విజయాలతో నాకౌట్ దశకు చేరింది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌ను ఓడించే జట్టే రాలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో గెలిచి అపజయమే లేని జట్టుగా నిలిచింది. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. ఆస్ట్రేలియా 2003, 2007లలో వరుసగా 11 మ్యాచ్‌లలో గెలిచింది. ఆ తర్వాత 9 విజయాలతో భారత్ ఉంది. 2003లో భారత్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలుచుకోగా ఈసారి మాత్రం టీమిండియా వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది. వరుసగా ఇన్ని మ్యాచ్‌లు గెలవడం వెనక ఉన్న తమ రహస్యాన్ని టీమిండియా సారధి రోహిత్ శర్మ బయటపెట్టేశాడు. ఆ వ్యూహంతోనే ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధిస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ మెగా టోర్నీలో తాము పాటించిన గేమ్ ప్లాన్ ఏంటనేది హిట్ మ్యాన్ వెల్లడించాడు.లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలవడంలో జట్టులోని ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించారని రోహిత్ అన్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి తాము పాటించిన గేమ్ ప్లాన్ ఒకటే అన్న రోహిత్.. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టి అందులో విజయం సాధించడానికి ఏం చేయాలనే దాని గురించే ఆలోచించామని చెప్పాడు. తమ ముందున్న మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచించామని.. సెమీస్, ఫైనల్ ఇలా ముందస్తు ఆలోచనలు చేయలేదని స్పష్టం చేశాడు. ఇక ముందూ అలానే చేస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ప్రపంచకప్ రెండే అడుగుల దూరంలో ఉన్న సమయంలో న్యూజిలాండ్ మ్యాచ్ గురించే తమ ప్రణాళికలన్నీ ఉంటాయని.. ఫైనల్ గురించి అప్పుడే ఆలోచించడం లేదని కూడా పరోక్షంగా వెల్లడించారు. ప్రపంచకప్ సుదీర్ఘమైన టోర్నమెంట్ అని... విభిన్న వేదికల్లో విభిన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సి ఉంటుందని.. మేం కుడా అలాగే ఆడి విజయం సాధించామని రోహిత్ చెప్పాడు.
లీగ్ స్టేజ్‌లో భారత్ ఆడిన 9 వేదికల్లో అన్నింట్లో విజయం సాధించడం మరింత ఆనందంగా ఉందని రోహిత్ అన్నాడు. తమ వరుస విజయాల వెనుక ఉన్న రహస్యం ఇదేన్న రోహిత్... జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఒక్కో సందర్భంలో బాధ్యతలు తీసుకుని సత్తా చాటడం శుభపరిణామమని కొనియాడాడు. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారని గుర్తు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుండాలంటే ఫలితాలు చాలా ముఖ్యమన్నాడు. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి జట్టు సభ్యులందరం కుటంబంలా మమేకమైపోయామని తెలిపాడు. స్వదేశంలో చాలా మ్యాచ్‌లు ఆడటం వల్ల తమకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నాడు. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యుల మధ్య వాతావరణం అద్భుతంగా ఉందన్న రోహిత్.. ఇదే తమ ప్రదర్శన మరింత మెరుగ్గా మారడానికి కారణమన్నాడు. తమపై అంచనాలు చాలా ఉన్నాయని తెలుసని... తాము అన్నింటినీ పక్కనపెట్టి, తదుపరి టాస్క్‌పైనే దృష్టి పెట్టాలనుకున్నామని రోహిత్ తెలిపాడు.
ఇక వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత్.... మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లీగ్ దశలోని తొమ్మిది మ్యాచ్‌లను గెలిచి.. పూర్తి ఆత్మ విశ్వాసంతో నాకౌట్‌లో అడుగు పెట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement