అన్వేషించండి

PAK Vs BAN: తక్కువ స్కోరుకే బంగ్లా కట్టడి, పాక్‌ బ్యాటర్లు ఏం చేస్తారో?

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేయాలన్న పట్టుదలతో ఉన్న పాకిస్థాన్‌... బంగ్లాదేశ్‌ను తక్కువస్కోరుకే పరిమితం చేసింది. 45.1  ఓవర్లలో 204 పరుగులకే బంగ్లా కుప్పకూలింది.

ప్రపంచకప్‌లో పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేయాలన్న పట్టుదలతో ఉన్న పాకిస్థాన్‌... బంగ్లాదేశ్‌ను తక్కువస్కోరుకే పరిమితం చేసింది. 45.1  ఓవర్లలో 204 పరుగులకే బంగ్లా కుప్పకూలింది. షహీన్‌ షా అఫ్రిదీ పదునైన పేస్‌తో బంగ్లా బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాడు. మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో బంగ్లాదేశ్‌ తక్కువ పరుగులకే పరిమితమైంది. సాంకేతికంగా ఉన్న సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే పాక్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. మరి 204 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ ఛేదిస్తుందో.. చతికిలపడుతుందో చూడాలి. షహీన్ షా అఫ్రిదీ, వసీమ్‌ బంగ్లా పతనాన్ని శాసించారు.


 ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అలా బ్యాటింగ్‌కు దిగారో లేదో బంగ్లాకు.. పాక్‌ స్టార్‌ పేసర్‌ షహీన్ షా అఫ్రిదీ షాక్‌ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే ఓపెనర్ తన్జీద్‌ హసన్‌ను అఫ్రిదీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బంగ్లా ఒక్క పరుగు చేయకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు ఆరు పరుగులకు చేరిందో లేదో తన తర్వాతి ఓవర్లో   షహీన్ షా అఫ్రిదీ మరోసారి దెబ్బకొట్టాడు. 3 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన నజ్ముల్ హొస్సేన్ శాంటోను అఫ్రిదీ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే జట్టు స్కోరు 23 పరుగుల వద్ద 5 పరుగులు చేసిన ముష్పికర్ రహీమ్‌ను హరీస్‌ రౌఫ్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆరు ఓవర్లకు 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లా పీకల్లోతు  కష్టాల్లో కూరుకుపోయింది. కానీ ఆ తర్వాత ఓపెనర్‌ లిట్టన్‌దాస్‌తో జత కలిసిన మహ్మదుల్లా పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.
 

లిట్టన్‌దాస్‌-మహ్మదుల్లా జోడి ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించింది. నాలుగో వికెట్‌కు ఈ జోడి 79 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఇఫ్తికార్ అహ్మద్‌ విడదీశాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న లిట్టన్‌ దాస్‌ను ఇఫ్తికార్‌ అవుట్ చేశారు. 64 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి లిట్టన్‌ దాస్‌ అవుటయ్యాడు. దీంతో 102 పరుగుల వద్ద బంగ్లా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే అర్ధ శతకం చేసి క్రీజులో స్థిరపడిన మహ్మదుల్లాను అవుట్‌ చేసి షహీన్‌ షా అఫ్రిదీ మరోసారి బంగ్లాను దెబ్బ కొట్టాడు. 70 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో 56 పరుగులు చేసిన మహ్మదుల్లాను షహీన్‌ షా అఫ్రిదీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తౌహీద్‌ హిద్రాయ్ కూడా ఏడు పరుగులకే అవుట్‌ కావడంతో 140 పరుగులకే బంగ్లా ఆరు వికెట్లు కోల్పోయింది.


 బంగ్లా స్కోరు 200 పరుగులైనా దాటుతుందా అన్న సందేహాలు నెలకొన్న వేళ సారధి షకీబుల్‌ హసన్‌ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 4 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న షకీబుల్‌ హసన్‌ను హరీస్‌ రౌఫ్‌ అవుట్ చేశాడు. మెహిదీ హసన్‌ మిరాజ్ కూడా 25 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరి భాగస్వా‌మ్యంతో బంగ్లా 200 పరుగుల మార్క్‌ను దాటింది. వీరిద్దరూ అవుటైన తర్వాత బంగ్లా పతనం వేగంగా సాగింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో బంగ్లా 45.1 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌట్‌ అయింది. పాక్‌ బౌలర్లలో షహీన్‌ షా అఫ్రిదీ 3, హరీస్ రౌఫ్‌ రెండు, మహ్మద్‌ వసీమ్‌ 3 వికెట్లు తీశారు. షహీన్‌ షా అఫ్రిదీ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 


 వరుసగా నాలుగు పరాజయాలతో ఇంటా బయట తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి విమర్శలకు చెక్‌ పెట్టాలని పాక్‌ భావిస్తోంది. నిరాశాజనక ప్రదర్శనలతో స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్‌ ఈ మ్యాచ్‌లో 204 పరుగులను లక్ష్యాన్ని ఛేదించాలని పట్టుదలగా ఉంది. బాబర్‌, మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్‌ భారీ స్కోర్లు చేస్తే పాక్ లక్ష్యం ఛేదించడం తేలికే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Embed widget