Moeen Ali Retirement: స్టోక్స్ మళ్లీ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా - మొయిన్ అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - రిటైర్మెంట్ ఖాయం!
ఇంగ్లాండ్ స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..? యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Moeen Ali Retirement: యాషెస్ సిరీస్‌కు ముందే టెస్టు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని జాతీయ జట్టుకు ఆడిన ఇంగ్లాండ్ స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడా..? స్వదేశంలో ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య నిన్న ముగిసిన యాషెస్‌లో భాగంగా ఆతిథ్య జట్టు స్పిన్ కష్టాలను తీర్చిన అలీ.. తాను వచ్చిన పని అయిపోయిందని మళ్లీ టెస్టు క్రికెట్ ఆడే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పాడు. ఒకవేళ టెస్టులు ఆడాలని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒత్తిడి చేస్తే తాను మాత్రం అతడి మెసేజ్‌ను డిలీట్ చేస్తానని తెలిపాడు.
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా ముగిసిన ఐదో టెస్టు ముగిసిన తర్వాత అలీ మాట్లాడుతూ.. ‘ఒకవేళ స్టోక్స్ మళ్లీ నాకు మెసేజ్ చేస్తే ఈసారి ఆ మెసేజ్‌ను డిలీట్ చేస్తా’ అని అన్నాడు. వాస్తవానికి స్టోక్స్.. యాషెస్ సిరీస్‌కు ముందు ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడటంతో అలీని రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆడేందుకు ఒప్పించాడు. టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో పాటు స్టోక్స్ కలిసి అలీని యాషెస్ ఆడే దిశగా మోటివేట్ చేశారు.
యాషెస్ - 2023లో అలీని స్టోక్స్ కేవలం బౌలర్‌గానే కాకుండా టాపార్డర్ బ్యాటర్‌గా కూడా వాడాడు. సహజంగానే దూకుడుగానే ఆడే అలీ.. తొలి టెస్టులో ఓలీ పోప్ గాయపడటంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌లో టాపార్డర్‌లో దాదాపు రైట్ హ్యాండ్ బ్యాటర్సే.. జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, జానీ బెయిర్ స్టో.. బెన్ స్టోక్స్ లెఫ్ట్ హ్యాండరే అయినా అతడు ఆరో స్థానంలో వచ్చేవాడు. అయితే అలీ రాకతో ఇంగ్లాండ్‌కు లెఫ్ట్ - రైట్ హ్యాండ్ కాంబినేషన్ సెట్ అయింది. చేతికి గాయమైనా నాలుగు టెస్టులూ ఆడిన అలీ.. బ్యాటింగ్‌లో 180 పరుగులు చేశాడు. బౌలర్‌గా 9 వికెట్లు కూడా తీశాడు. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను దెబ్బతీయడంలో క్రిస్ వోక్స్ (4 వికెట్లు) తో పాటు అలీ (3 వికెట్లు)దే కీలక పాత్ర.
Moeen Ali confirms his retirement from Test cricket
— Sky Sports Cricket (@SkyCricket) July 31, 2023
🗣️ "I know I'm done. If Stokesy messages me again, I am going to delete it!" 🤣 pic.twitter.com/4CBeOp97qT
రిటైర్మెంట్‌పై..
‘ఈ సిరీస్‌ను విజయంతో ముగించడం ఆనందంగా ఉంది. స్టోక్స్ నన్ను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రీఎంట్రీ ఇవ్వమన్నప్పుడు నేను కాదనే చెప్పాను. అదీగాక నేను ఆస్ట్రేలియా మీద గతంలో కూడా బాగా ఆడలేదు. అందుకే నేను మళ్లీ ఆడనని చెప్పా. కానీ స్టోక్స్ మాత్రం నాలో స్ఫూర్తిని నింపాడు. ఏడాదికాలంగా అద్భుతంగా టెస్టు జట్టులో నేనెందుకు ఉండకూదని అనిపించింది. అందుకే రీఎంట్రీ ఇచ్చాను. టీమ్‌లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. తొలి రోజు నుంచే నేను చాలా ఎంజాయ్ చేశాను. బ్రాడీ (స్టువర్ట్ బ్రాడ్), జిమ్మీ (జేమ్స్ అండర్సన్)లతో కలిసి మరోసారి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను నా కెరీర్ ఆరంభించినప్పట్నుంచీ ఈ ఇద్దరూ జట్టులో ఉన్నారు.. ఆస్ట్రేలియాపై గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాల్లో నావంతు సాయం కూడా ఉండటం మరింత హ్యాపీ.. టెస్టులలో మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉంది..’ అని అలీ చెప్పుకొచ్చాడు.
2021 సెప్టెంబర్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి పరిమిత ఓవర్లకే పరిమితమైన అలీ.. యాషెస్‌తో వ్యక్తిగతంగా కూడా పలు రికార్డులు సాధించాడు. ఇప్పటివరకూ అలీ.. 68 టెస్టులలో 204 వికెట్లు తీయడమే గాక 3,094 పరుగులు చేశాడు. టెస్టులలో 200 వికెట్ల ఘనత, 3 వేల పరుగుల రికార్డులు కూడా ఈ యాషెస్‌లో సాధించనవే కావడం గమనార్హం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial