Mayank Agarwal: ఐసీయూలో మయాంక్ అగర్వాల్! విమాన ప్రయాణంలో ఏమైంది?
Mayank Agarwal Health Update: మయాంక్ అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
విమానంలోనే...
కలుషిత నీటిని తాగడం వల్లే మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కర్నాటక గోవాతో పాటు త్రిపురపైనా గెలిచింది. ‘త్రిపురతో మ్యాచ్ ముగిసిన తర్వాత కర్నాటక జట్టు సూరత్‌కు ప్రయాణమైంది. ఇదే సమయంలో వాంతులతో ఇబ్బందిపడ్డ అగర్వాల్ తనకు గొంతులో మంటగా ఉందని చెప్పాడు. కర్నాటక టీమ్ అధికారులు మాకు ఈ విషయం చెప్పడంతోనే వెంటనే విమానం నుంచి కిందకు దించి అగర్తలాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం అగర్వాల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు..’ అని త్రిపుర క్రికెట్ అసోసియేషన్(Tripura Cricket association) ప్రతినిధి తెలిపారు. మయాంక్ అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ తెలిపారు.
రంజీల్లో హైద్రాబాద్ జైత్రయాత్ర
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్లేట్ గ్రూప్‌లో ఇప్పటికే వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన హైద్రాబాద్ జట్టు... తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 187 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించిన హైద్రాబాద్.. నాలుగో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ విజయం సాధించి సత్తా చాటింది. ప్లేట్ గ్రూప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసుకున్న హైదరాబాద్.. తాజాగా ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ బాదడంతో అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 187 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ రెండు రోజుల్లోనే ఫలితం రావడం కొసమెరుపు. ఓవర్‌నైట్ స్కోరు 529/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్.. 615/4 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ 256 పరుగులకు ఆలౌటైంది. దివ్యాన్ష్ (91) టాప్ స్కోరర్ కాగా.. తనయ్, సాయిరామ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తాజా సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ బోనస్ పాయింట్ విజయాలు సాధించింది.