అన్వేషించండి
Advertisement
Aiden Markram: ఓడినా గర్వపడుతున్నాం, చివరి వరకూ పోరాడాం: మార్క్రమ్
South Africa's captain Markram: టీ20 ప్రపంకప్ 2024 ఫైనల్లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ తారువాత మాట్లాడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తమ జట్టు పై ప్రశంసల జల్లు కురిపించాడు.
Aiden Markram post match Comments : ఐసీసీ టోర్నీల్లో దురదృష్టపు జట్టుగా ముద్రపడిన సౌతాఫ్రికా(South Africa)... ఈ టీ 20 ప్రపంచ కప్(T20 World Cup 2024)లో ఫైనల్ చేరి ఆ చరిత్రను మార్చింది. అయితే పైనల్లో తేలిగ్గా గెలిచే స్థితి నుంచి ఓడిపోయి తమ జట్టు ఒత్తిడిని ఎదుర్కోలేదనే అపప్రదను కొనసాగించింది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో... చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉండడంతో ప్రొటీస్ గెలుపు తేలికే అని అంతా అనుకున్నారు. అయితే భారత సీమర్లు అద్భుత బౌలింగ్‌తో భారత్ జగజ్జేతగా నిలిచి దక్షిణాఫ్రికాకు మరోసారి గుండె కోతను మిగిల్చింది. ఈ ఓటమి తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్( Markram) కూడా చాలా ముభావంగా కనిపించాడు. ఈ ఓటమి తనకు బాధ కలిగిస్తోందని... కానీ తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన చూసి గర్విస్తున్నానని సఫారీ కెప్టెన్(South Africa's captain) అన్నాడు.
తేరుకోవడానికి సమయం పడుతుంది
ఈ టీ 20 ప్రపంచకప్‌ను గెలిచేందుకు సౌతాఫ్రికాకు 99 శాతం అద్భుత అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాలన్నింటినీ సఫారీ జట్టు వృథా చేసుకుంది. అత్యంత నాటకీయ బౌలింగ్ పునరాగమనంతో టీమిండియా విజయకేతనం ఎగరేసి... విశ్వ విజేతలుగా నిలవడంతో దక్షిణాఫ్రికా గత ప్రపంచకప్ టోర్నీలో అనుభవించిన బాధను మళఅలీ అనుభవించింది. అయితే సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మాత్రం తమ జట్టు కప్ గెలిచేందుకు చేసిన ప్రయత్నాలను కొనియాడాడు. తమ జట్టు ప్రదర్శనపై తాము గర్వంగా ఉన్నామని... వరుసగా ఎనిమిది విజయాలు సాధించామని గుర్తు చేశాడు.ఈ ప్రపంచకప్‌లో తాము ఒకే మ్యాచ్ ఓడిపోయామని... అది ఫైనల్ అని మార్క్రమ్ అన్నాడు. ఈ ఓటమి తమకు బాధ కలిగించిందని... కానీ ఈ జట్టులో ప్రతీ ఆటగాడి ప్రదర్శనపై తాను చాలా గర్వపడుతున్నానని మార్క్రమ్ వెల్లడించాడు. తమ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారన్న సౌతాఫ్రికా సారధి... భారత్‌ను తాము తక్కువ పరుగులకే పరిమితం చేశారని అన్నాడు. తాము కూడా బాగా బ్యాటింగ్ చేశామని... కానీ చివర్లో భారత బౌలర్లు పుంజుకుని తమను లక్ష్యానికి దూరం చేశారని తెలిపాడు. ఈ మ్యాచ్ క్రికెట్‌కు చాలా మంచిదన్నాడు.
చివరి వరకూ పోరాడాం
ఈ ప్రపంచకప్‌లో తమ పోరాటం చివరి బంతి వరకూ పోరాడామని మార్క్రమ్ తెలిపాడు. ఈ ప్రపంచకప్‌లో తాము ఫైనలిస్టులమని... గెలిచే అవకాశాలు సృష్టించుకున్నామని.. కానీ దురదృష్టవశాత్తు తాము అనుకున్నది జరగలేదని సౌతాఫ్రికా సారధి వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఈ టోర్నమెంట్ చాలా ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుందని మార్క్రమ్ తెలిపాడు. ఇప్పుడు తాము సెమీస్‌ను దాటి ఫైనల్‌కు చేరామని ఇక రానున్న టోర్నమెంట్‌లో తమ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందని వివరించాడు. తమ ప్రదర్శనతో యువ ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని.. అది రానున్న తరాలకు మార్గనిర్దేశనం చేస్తుందని మార్క్రమ్ తెలిపాడు. తమ జట్టు ప్రదర్శన ఓవరాల్‌గా సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement