అన్వేషించండి

England Cricket: ఇంగ్లాండ్‌ కోచ్‌గా పోలార్డ్‌ -ఈసీబీ కీలక నిర్ణయం

England Cricket: ఇంగ్లాండ్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌, విధ్వంసకర బ్యాటర్‌ కీరన్ పొలార్డ్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించింది.

వచ్చే ఏడాది అమెరికా-వెస్టిండీస్‌(West Indies and USA) సంయుక్తంగా నిర్వహించనున్న టీ 20 ప్రపంచకప్‌ నిర్వహించనున్నాయి. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటాలని ఇంగ్లాండ్‌(England) గట్టి పట్టుదలతో ఉంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన బ్రిటీష్‌ జట్టు టీ 20 ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్‌(West Indies) మాజీ కెప్టెన్‌, విధ్వంసకర బ్యాటర్‌ కీరన్ పొలార్డ్‌(Kieron Pollard)ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ కోసం ఇంగ్లండ్‌ పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్‌గా(assistant coach ) వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను నియమించామని ఈసీబీ వెల్లడించింది. పొలార్డ్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. టీ20ల్లో 600 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అటువంటి లెజెండరీ క్రికెటర్‌తో ఒప్పందం కుదర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇంగ్లండ్‌ వెల్స్‌ క్రికెట్‌ బోర్డు(England and Wales Cricket Board) ఒక ప్రకటనలో పేర్కొంది.

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌( international cricket)కు గుడ్‌బై చెప్పిన పొలార్డ్‌ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ స్ధాయిలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ 15 ఏళ్ల పాటు విండీస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పొలార్డ్.. వరుసగా 2,706, 1569 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 3 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమవుతోంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను విజయంవంతంగా నిర్వహించిన ఐసీసీ... 2024లో టీ 20 ప్రపంచకప్‌ నిర్వహణకు సిద్ధమైంది. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా టీ20 ప్రపంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఐసీసీ ఇప్పటికే విడుద‌ల చేసింది. పురుషుల క్రికెట్‌, మ‌హిళ‌ల క్రికెట్‌కు సంబందించిన టీ 20 ప్రపంచకప్‌ లోగోల‌ను విడుద‌ల చేసింది. లోగోల‌పై క్రికెట్ బ్యాట్, బంతితో పాటు ప్లేయ‌ర్ల ఎన‌ర్జీని సూచించే సంకేతం ఉంది. మొత్తంగా ఈ లోగోలు టీ20 క్రికెట్‌ను ప్రతిబింబించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొత్త లోగోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

2024 టీ20 ప్రపంచకప్‌  ఎలా ఉండనుంది అంటే: 
2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget