అన్వేషించండి

Virat Kohli: కోహ్లీ పరుగుల వెనక రహస్యమదే

ODI World Cup 2023: భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడమే తన ఆటలో ముఖ్య అంశం అని చెబుతున్న కోహ్లీ.

ODI World Cup 2023: 2023 ప్రపంచం కప్‌(World Cup 2023)లో భారత జట్టు మెరుపులు మెరిపిస్తోంది. అందరు ఆటగాళ్లు ఓ వైపు వ్యక్తిగత రికార్డులు బద్దలు కొడుతూనే టీంగా ముందుకు సాగిపోతున్నారు. ఇక వరల్డ్ కప్‌లో అత్యధిక భారత అభిమానులు ధరించిన జెర్సీ మీద విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరుండటం చూస్తే తెలుస్తుంది భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఉన్న విలువ ఏమిటో. ఇంతమంది చేత స్పెషల్ అట్రాక్షన్‌గా పిలిచే కోహ్లీ గురించి ఒక విషయం మనల్ని ఆశ్చర్యపరచక మానదు..మీ ఆటలో కీలక అంశం ఏమిటి అని కోహ్లీని అడిగితే అతను చెప్పే  జవాబు..  భావోద్వేగాల్ని(Emotions) అదుపులో ఉంచుకోవడమే అని. తాను ఎల్లప్పుడూ  ఉద్వేగాల్ని, భావాల్ని నియంత్రణలో ఉంచుకోవాలని అనుకుంటానని, అదే తన ఆట(Game)లో చాలా ముఖ్యమైన భాగం అని చెబుతాడు కోహ్లీ. మ్యాచ్‌కు ముందు అదే అవగాహనతో ఉంటానని అంటాడు ఈ స్టార్ బ్యాటర్. తను 49వ సెంచరీ సాధించాక సచిన్‌ అభినందన సందేశం హృదయాన్ని ఎంతో హత్తుకుందని చెప్పే విరాట్‌,  2022 టీ20 ప్రపంచకప్‌(T 20 World Cup 2022)లో మెల్‌బోర్న్‌(Melbourne)లో పాకిస్థాన్‌(Pakistan)పై గెలుపు తర్వాత రోహిత్‌శర్మ(Rohit Sharma) భావోద్వేగం చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతే కలిగిందని గుర్తు చేసుకున్నాడు. ఆసియా కప్‌(Asia Cup)లో ఇచ్చిన  మెరుగైన ప్రదర్శన ప్రపంచకప్‌కు ముందు తనను  మంచి మానసిక స్థితిలో నిలిపిందన్నాడు. 

 కోహ్లి తన రికార్డు(Record)ను సమం చేయడంపై సోషల్ మీడియా(Social Media) ఎక్స్(X) ద్వారా సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) స్పందించాడు.  "అద్భుతంగా ఆడావు విరాట్. నేను 49 నుంచి 50ల్లోకి రావడానికి 365 రోజులు పట్టింది. నువ్వు నా రికార్డు బ్రేక్ చేయడానికి 49 నుంచి 50కి మరికొద్ది రోజుల్లోనే వెళ్తావని ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్స్" అని సచిన్ ట్వీట్ చేశాడు.  

ఈ సందర్భంగా స్పందించిన కోహ్లీ  క్రికెట్‌లో ఇది తనకు ఎమోషనల్ జర్నీ అన్నాడు. టెండూల్కర్ నుంచి ప్రత్యేక సందేశాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తాను ఆరాధించే ఆటగాడి రికార్డును సమం చేయడం, అతడి నుంచి సందేశం అందుకోవడం భావోద్వేగంగా ఉందని కోహ్లీ అన్నాడు. తాను సచిన్‌ బ్యాటింగ్ చూస్తూ పెరిగానన్న విరాట్‌.. తాను ఎప్పుడూ సచిన్‌లా రాణించలేదని అన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా మూలాలు ఏంటో నాకు బాగా తెలుసన్న కోహ్లీ... ఇక్కడ నిలబడి సచిన్‌ ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. 

వైఫల్యాల మధ్యే మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్ కోహ్లీ... ఈ పుట్టిన రోజున తాను ఎంతో ఆరాధించే సచిన్ రికార్డును సమం చేసి తనకు తానే మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికాపై బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 119 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించి విరాట్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును సమం చేశాడు. మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్‌...101 పరుగులతో అజేయంగా నిలిచాడు. పిచ్‌పై బంతి తిరుగుతున్న వేళ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును కోహ్లీ సమం చేశాడు. నిజానికి విరాట్ కోహ్లి గత రెండున్నరేళ్లుగా ఫామ్‌లో లేని కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. టెస్టులు, వన్డేలు, టీ ట్వంటీ ఇలా ఒక్క  ఫార్మెట్‌లో కూడా ఒక్క సెంచరీ కూడా చేయలేక చతికిలపడిపోయాడు.  కానీ, ఇపుడు క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ యేడాది నుంచి అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ఆసియా కప్‌లో అద్భుత శతకంతో తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకున్నాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget