అన్వేషించండి

CSKలో చేరిన తరువాత Sanju Samson తొలి పోస్ట్ చూశారా.. RRకు సైతం థ్యాంక్స్

ఐపీఎల్ 2026 (IPL 2026)లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు. అధికారిక ప్రకటన తర్వాత శాంసన్ స్పందించాడు. రాజస్తాన్ రాయల్స్‌కు సైతం థ్యాంక్స్ చెప్పాడు.

Sanju Samson In IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) రాబోయే సీజన్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల వచ్చిన రిపోర్టులు నిజమయ్యాయి. సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తీసుకుంది. MS ధోనితో కలిసి శాంసన్ సీఎస్కేకు ఆడనున్నాడు. BCCI దీనిని అధికారికంగా ప్రకటించింది. రాజస్తాన్ రాయల్స్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు కొంతకాలం కిందట శాంసన్ చేసిన ప్రకటనతో సీఎస్కే సహా పలు ఫ్రాంచైజీలు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ప్రయత్నించినా చివరికి సీఎస్కే అతడ్ని సొంతం చేసుకుంది. బీసీసీఐ అధికారిక ప్రకటన తర్వాత సంజూ శాంసన్ సోషల్ మీడియాలో 2 పోస్టులు పెట్టాడు. మొదటి పోస్ట్ రాజస్థాన్ రాయల్స్‌ ను వీడటం గురించి, రెండవది చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడంపై పోస్ట్ చేశాడు. 

వేలానికి ముందు ట్రేడ్ డీల్ ద్వారా సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. CSKలో అతనికి రూ.18 కోట్లు ఆఫర్ చేశారు. ఇది గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో కూడా అందుకున్న మొత్తం. CSK ప్లేయర్లు రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ తీసుకుంది. సంజూను వదులుకునేందుకు ఇద్దరు ఆటగాళ్లను రాజస్తాన్ కోరిందని ఇటీవల వైరల్ అయింది. ఇదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది.

CSKలో చేరిన తర్వాత సంజూ శాంసన్ రియాక్షన్

రాజస్తాన్‌ను వీడి సీఎస్కేలో చేరిన తరువాత సంజూ శాంసన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో సంజూ శాంసన్ సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. శాంసన్ పసుపు రంగు (CSK జెర్సీ రంగు) బ్యాండ్ చేతికి ధరించాడు. పసుపు రంగు టీషర్ట్ కూడా ధరించాడు. "వణక్కం" అని తొలి పోస్ట్ చేశాడు. తమిళంలో వణక్కం అంటే నమస్తే అని అర్థం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanju V Samson (@imsanjusamson)

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌ను వీడుతున్నట్లు ఒక పోస్ట్ చేశాడు. "నేను ఇక్కడ కొద్దికాలం మాత్రమే ఉన్నాను. ఈ ఫ్రాంచైజీకి నా వంతు కృషి చేశా. గొప్ప క్రికెట్‌ను ఆస్వాదించాము. కొన్ని జీవితకాల అనుబుంధాలు ఏర్పడ్డాయి. ఫ్రాంచైజీలోని వారందరినీ మా కుటుంబంగా భావించా. సమయం వచ్చింది, నేను ముందుకు సాగుతున్నాను. ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ అన్ని విషయాలకూ ఎల్లప్పుడూ కృతజ్ఞుడను" అని సంజూ శాంసన్ పోస్టులో రాసుకొచ్చాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanju V Samson (@imsanjusamson)

సంజూ శాంసన్ మూడో IPL జట్టు CSK

సంజూ శాంసన్ తన IPL కెరీర్‌ను రాజస్థాన్ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. 2013 నుండి 2015 వరకు రాజస్థాన్‌లోనే ఉన్నాడు. 2016, 2017లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 2018లో తిరిగి రాజస్థాన్‌కు వచ్చాడు. IPLలో 177 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 4704 పరుగులు చేశాడు. శాంసన్ IPLలో 3 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు సాధించాడు. రాజస్తాన్ కెప్టెన్‌గా సేవలు అందించిన సంజూ శాంసన్ ఇక సీఎస్కే జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Embed widget