News
News
వీడియోలు ఆటలు
X

Yashasvi Jaiswal: ఫస్ట్ మ్యాచ్‌లో మెక్ ‘కల్లోలం’ - 1000వ మ్యాచ్‌లో జైస్వాల్ వీరంగం

IPL 2023: ఐపీఎల్‌-16లో మూడో సెంచరీ నమోదైంది. రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న ముంబై కుర్రాడు యశస్వి జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు.

FOLLOW US: 
Share:

Yashasvi Jaiswal Hundred:  ముంబైలోని వాంఖెడే వేదికగా ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో  మరో సెంచరీ నమోదైంది. ముంబైలో పుట్టి పెరిగి దేశవాళీలో  అదే టీమ్‌కు ఆడుతూ  ఐపీఎల్ లో రాజస్తాన్  రాయల్స్‌కు ఆడుతున్న  యశస్వి జైస్వాల్..  53 బంతుల్లోనే  మూడంకెల స్కోరు చేశాడు. ఈ సీజన్‌లో ఇది మూడో సెంచరీ.  ఈ శతకం ద్వారా  జైస్వాల్ పలు ఘనతలు సాధించాడు. 

ఫస్ట్ మ్యాచ్‌లో మెక్ కల్లమ్..  

ఐపీఎల్ లో  నేడు ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ 1000వది.  2008 ఏప్రిల్   18న  కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్) సెంచరీతో కదం తొక్కాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేశాడు. 

వెయ్యో మ్యాచ్‌లో జైస్వాల్.. 

ఇక ముంబై - రాజస్తాన్ ల మధ్య జరుగుతున్న వెయ్యో మ్యాచ్‌లో జైస్వాల్ రెచ్చిపోయాడు. ముంబైతో  పోరులో 32 బంతుల్లో అర్థ సెంచరీ  పూర్తి చేసిన జైస్వాల్.. 53 బంతుల్లో సెంచరీ చేశాడు.  ఈ క్రమంలో ప్రత్యేకమైన మ్యాచ్ లో శతకం సాధించి ప్రత్యేకమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో జైస్వాల్‌కు ఇది మొదటి శతకం. 

పిన్న వయస్కుడిగా.. 

ముంబైపై సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్..  ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుల వారి జాబితాలో చేరాడు. ఐపీఎల్ లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లలో  మనీష్ పాండే (19 ఏండ్ల 253 రోజులు)  ముందున్నాడు.  పాండే.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ పై సెంచరీ చేశాడు.  ఆ తర్వాత రిషభ్ పంత్ (20  ఏండ్ల 218 రోజులు -  2018లో సన్ రైజర్స్ పై), దేవదత్ పడిక్కల్ (20 ఏండ్ల 289 రోజులు - 2021లో రాజస్తాన్ పై)లు జైస్వాల్ కంటే ముందున్నారు. జైస్వాల్  21 ఏండ్ల  123 రోజుల వయసులో  ముంబైపై సెంచరీ సాధించి  సంజూ శాంసన్ (22 ఏండ్ల 151  రోజులు- రైజింగ్ పూణె జెయింట్స్-2017లో) రికార్డును అధిగమించాడు. 

ఆరెంజ్ క్యాప్ సొంతం..

తన కెరీర్  లో తొలిసారి మూడంకెల స్కోరు చేయడం ద్వారా యశస్వి జైస్వాల్  ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ముగిసేసరికి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.  ముంబై - రాజస్తాన్ మ్యాచ్  ముందువరకూ  ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ) ఈ జాబితాలో  (8 మ్యాచ్ లు 422 రన్స్) ముందుండగా ముంబైపై సెంచరీతో జైస్వాల్  428 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే  సీజన్ ముగిసేవరకు ఆరంజ్ క్యాప్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 

Published at : 30 Apr 2023 10:35 PM (IST) Tags: Mumbai Indians Indian Premier League Rajasthan Royals MI vs RR IPL 2023 Yashasvi Jaiswal Yashasvi Jaiswal Hundred

సంబంధిత కథనాలు

WTC Final: ఓవల్‌ సీక్రెట్‌ ప్యాటర్న్‌ అదే - రన్స్‌ కొట్టే టెక్నిక్‌ చెప్పిన హిట్‌మ్యాన్‌!

WTC Final: ఓవల్‌ సీక్రెట్‌ ప్యాటర్న్‌ అదే - రన్స్‌ కొట్టే టెక్నిక్‌ చెప్పిన హిట్‌మ్యాన్‌!

WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే

WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే

Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు

Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు

Asia Cup: మాకు సాయం చేస్తారనుకుంటే వెన్నుపోటు పొడుస్తారా? - లంక బోర్డుపై పీసీబీ అసంతృప్తి

Asia Cup: మాకు సాయం చేస్తారనుకుంటే వెన్నుపోటు పొడుస్తారా? - లంక బోర్డుపై పీసీబీ అసంతృప్తి

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ