IPL 2023: గీత దాటితే కోత పడుద్ది - బీసీసీఐకి మరింత ఆదాయం - రూ. 1 కోటికి చేరిన జరిమానాల విలువ
ఐపీఎల్-16లో జరిమానాలు కెప్టెన్ల జేబులను చిల్లులు చేస్తున్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ గీత దాటితే కోత పడటం ఖాయం.
Slow Over Rate Fines in IPL 2023: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరింత ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16 సీజన్ లో సోమవారం నాటికి 53 మ్యాచ్‌లు ముగియగా ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ ఖాతాలో కోటి రూపాయలు చేరాయి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు గాను ఆయా జట్లు భారీగా నష్టపోతున్నాయి.
ఐపీఎల్-16లో భాగంగా సోమవారం పంజాబ్ - కోల్‌కతా మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను కేకేఆర్ సారథి నితీశ్ రాణాకు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. తద్వారా ఇప్పటివరకు ఈ సీజన్ లో కేవలం స్లో ఓవర్ రేట్ ద్వారా జరిమానాలు విధించిన నగదు విలువ కోటి రూపాయలు (రూ. 1.08 కోట్లు) దాటింది.
ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గతంలో ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించిన ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్, కేకేఆర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్, లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్, గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాలు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కున్నవారే.
ఏంటీ నిబంధన..?
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం బౌలింగ్ చేసే ఒక జట్టు 90 నిమిషాల వ్యవధి (గంటన్నర)లో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయాలి. ఇందులో 2 రెండున్నర నిమిషాల స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లు కూడా ఉంటాయి. జట్లు, ఆటగాళ్లు తీసుకునే డీఆర్ఎస్, అంపైర్ రివ్యూలు, ప్లేయర్స్ ఇంజ్యూరీస్ వల్ల గడిచే టైమ్ ఇందులోకి ఇంక్లూడ్ కాదు.
IPL 2023: Nitish Rana fined Rs 12 lakh for KKR's slow over-rate in win vs PBKS pic.twitter.com/4PPGtOUptp
— Nitish Shekhawat (@nitishshekhawa1) May 9, 2023
ఫైన్స్ ఇలా..
- ఒక జట్టు నిర్ణీత గడువులో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయే క్రమంలో మొదటిసారి తప్పు అయితే ఆ టీమ్ కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా పడుతుంది. ఐపీఎల్-16లో ఫస్ట్ ఫైన్ పడింది ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు..
- రెండోసారి కూడా అదే రిపీట్ అయితే కెప్టెన్‌కు రూ. 24 లక్షలు జరిమానా.. జట్టులోని మిగతా ఆటగాళ్ల (ఇంపాక్ట్
సబ్స్ తో కలిపి) రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఈ సీజన్ లో రూ. 24 లక్షల జరిమానా ఎదుర్కున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ (రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్‌లో).
- ఇదే తప్పు మూడోసారి చేస్తే జట్టు సారథికి రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం. టీమ్ మెంబర్స్‌కు రూ. 12 లక్షల జరిమానా లేదా 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత.