అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ఉప్పల్ ఊపిరి పీల్చుకో.. ఐపీఎల్ ఆగయా..! హైదరాబాద్‌లో సన్ రైజర్స్ రికార్డులివే..

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్.. స్వంత గ్రౌండ్ లో రాజస్తాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది.

Sun Risers Hyderabad In Uppal Stadium: నాలుగేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత  భాగ్యనగారానికి మళ్లీ క్రికెట్ పండుగ వచ్చింది. 2019 తర్వాత  హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ  క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది.  నాలుగేండ్ల క్రితం వరకూ ఐపీఎల్ ఫీవర్‌తో దేశంలోని మిగతా నగరాలూ ఊగిపోయినట్టే భాగ్యనగరం కూడా  పరుగుల జడివానలో తడిసి ముద్దయ్యేది. కానీ మాయదారి రోగం  కరోనా కారణంగా  మధ్యలో మూడు సీజన్లు  ఆంక్షల వలయంలో జరిగిన ఐపీఎల్.. ఈ సీజన్ నుంచి  ‘ఇంటా బయటా’ (హోం అండ్ అవే)   విధానంలో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో  స్వంత గ్రౌండ్ లో  ఆడనున్న  సన్ రైజర్స్ హైదరాబాద్ కు.. ఉప్పల్ లో రికార్డులు ఎలా ఉన్నాయి. వరుసగా మూడు సీజన్లుగా నిరాశపరుస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఉప్పల్ కొత్త ఊపిరిలూదుతుందా..? 

ఉప్పల్ దంగల్‌లో.. 

2004లో నిర్మితమైన  ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు  64 మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇందులో గతంలో ఉన్న డెక్కన్ ఛార్జర్స్  మ్యాచ్ లను తీసేస్తే..   2013 నుంచి డీసీ స్థానంలో వచ్చిన  సన్ రైజర్స్ హైదరాబాద్ 49 మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ  హై స్కోరింగ్ గేమ్స్ కంటే  మోస్తారు (130 - 160) స్కోర్లే ఎక్కువగా నమోదయ్యాయి.  100 -150 మధ్య స్కోర్లు  ఏకంగా 32 సార్లు నమోదయ్యాయి.  200 ప్లస్  స్కోర్లు 8 సార్లు రికార్డయ్యాయి. ఉప్పల్ లో  తొలుత  బ్యాటింగ్ చేసిన జట్టు 27 మ్యాచ్ లను గెలవగా   ఛేదన చేసిన  జట్టు  37  సార్లు గెలిచింది. ఉప్పల్ లో భారీ స్కోర్ల గేమ్స్ కంటే  లో డిఫెండింగ్ స్కోర్లే ఎక్కువ.  బ్యాటర్లతో పాటు బౌలర్లకూ అనుకూలించే ఈ పిచ్  పై  ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ల గురించి హైదరబాద్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. 

గణాంకాలు.. 

- ఉప్పల్ లో అత్యధిక స్కోరు  :  231-2  (2019లో  ఆర్సీబీపై) 
- అత్యల్ప స్కోరు :   80 (ఢిల్లీ- 2013లో) 
- అత్యధిక వ్యక్తిగత స్కోరు : డేవిడ్ వార్నర్  (126).. 2017లో కేకేఆర్ పై.. 
- అత్యధిక పరుగులు :  డేవిడ్ వార్నర్  (1,602  రన్స్)
- అత్యధిక సిక్సర్లు : వార్నర్ (46 ఇన్నింగ్స్ లలో  71)
- అత్యధిక ఫోర్లు : శిఖర్ ధావన్ (64 ఇన్నింగ్స్ లలో 154) 
- అత్యధిక వికెట్లు : భువనేశ్వర్ కుమార్  (36) 
- బెస్ట్ బౌలింగ్ : అల్జారీ జోసెఫ్  (6-12) 2019లో ఎస్ఆర్‌హెచ్ పై.. 

 

ఎస్ఆర్‌హెచ్‌కు అనుకూలమా..?

బ్యాటర్లతో పాటు బౌలర్లకూ అనుకూలించే ఉప్పల్ పిచ్   ఎస్ఆర్‌హెచ్ కు కీలక విజయాలు అందించింది.  అయితే  గతంలో   లో స్కోరింగ్ గేమ్స్ నమోదైన ఈ పిచ్ లో గతేడాది  ఆస్ట్రేలియాతో  టీ20తో  పాటు ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇక్కడే వన్డేలలో తొలి డబుల్ సెంచరీ చేశాడు. ఇదే మ్యాచ్ లో కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రాస్‌వెల్ కూడా వీరబాదుడు బాదాడు. ఇది కూడా  సన్ రైజర్స్ కు మంచిదే. ఈసారి జట్టులో  హెన్రిచ్ క్లాసెన్,  మార్క్‌రమ్, హెన్రీ బ్రూక్ వంటి ఆటగాళ్ల రూపంలో దంచే బ్యాటర్లు ఉన్నారు. వీరు గనక చెలరేగితే  అభిమానులకు పరుగుల పండుగే.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget