By: ABP Desam | Updated at : 12 May 2023 09:44 AM (IST)
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల ఘనత సొంతం చేసుకున్న చహల్ ( Image Source : Rajasthan Royals Twitter )
IPL Highest Wicket Taker: చహల్ కొట్టేశాడు. భారత్ వేదికగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వికెట్ల వీరుడి రికార్డును సొంతం చేసుకున్నాడు. గత సీజన్‌కు ముందు వరకూ శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ, 2022లో వెస్టిండీస్ మీడియం పేసర్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డును ఓ భారతీయ బౌలర్ అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్ అందుకు వేదికైంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాను 11వ ఓవర్లో రెండో బంతికి ఔట్ చేయడంతో చహల్.. బ్రావో రికార్డు (183 వికెట్లు)ను దాటి కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లోనే చహల్.. లసిత్ మలింగ (170)ను దాటేసిన విషయం తెలిసిందే. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు సన్ రైజర్స్ తో పోరులో 4 వికెట్లు తీసిన చహల్.. బ్రావో రికార్డును సమం చేయగా నిన్నటి మ్యాచ్‌తో దానిని అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు :
1. యుజ్వేంద్ర చహల్ : 187
2. డ్వేన్ బ్రావో : 183
3. పియూష్ చావ్లా : 174
4. అమిత్ మిశ్రా : 172
5. రవిచంద్రన్ అశ్విన్ : 171
Milestone 🚨 - Yuzvendra Chahal becomes the leading wicket-taker in IPL 👏👏#TATAIPL | @yuzi_chahal pic.twitter.com/d70pnuq6Wi
— IndianPremierLeague (@IPL) May 11, 2023
పర్పుల్ క్యాప్ కూడా..
కేకేఆర్‌తో మ్యాచ్‌లో చహల్.. నాలుగు వికెట్లు తీయడంతో మరోసారి ఈ సీజన్‌లో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఐపీఎల్-16 లో ఇప్పటివరకు చహల్.. 12 మ్యాచ్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడుసార్లు 4 వికెట్ల ప్రదర్శన ఉండటం గమనార్హం. చహల్ సాధించిన ఈ ఘనతతో ఐపీఎల్ లో అత్యధిక పరుగులు (విరాట్ కోహ్లీ- 7,044) అత్య ధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లిద్దరూ భారత్ నుంచే చోటు దక్కించుకోవడం విశేషం.
చహల్ ప్రస్థానం..
2013లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చహల్ తొలుత ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. కానీ చహల్‌కు గుర్తింపు వచ్చింది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తోనే. 2014 సీజన్ నుంచి 2021 వరకూ 9 సీజన్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన చహల్.. 113 మ్యాచ్‌లలో 130 వికెట్లు పడగొట్టాడు. కానీ 2022 సీజన్‌కు ముందు ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. వేలంలో రాజస్తాన్ రాయల్స్ చహల్ ను దక్కించుకుంది. ఈ రెండు సీజన్లలో ఇప్పటివరకు 29 మ్యాచ్ లు ఆడిన అతడు.. 48 వికెట్లు పడగొట్టాడు. చహల్ అత్యధికంగా 2015 సీజన్ లో 27 వికెట్లు తీశాడు.
చావ్లాకూ ఛాన్స్..!
అత్యధిక వికెట్లు తీసిన వారిలో టాప్ - 5లో ఉన్నవారిలో బ్రావో మినహా మిగిలినవారంతా భారతీయ బౌలర్లే. అదీగాక వీళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం ఈ సీజన్లో బ్రావో రికార్డును బ్రేక్ చేయడానికి మరో భారత బౌలర్‌కు కూడా అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పియూష్ చావ్లా ప్రస్తుతం 174 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరో 10 వికెట్లు తీస్తే అతడు బ్రావోను దాటేయొచ్చు. ఐపీఎల్-16లో ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. 17 వికెట్లతో దూసుకుపోతున్నాడు. ముంబై ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కంటే ముందే మరో మూడు మ్యాచ్ లు ఆడుతుంది. ప్లేఆఫ్స్ బెర్త్ కూడా కన్ఫర్మ్ అయితే మరో రెండు పక్కా. అంటే ఐదు మ్యాచ్ లలో పది వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాదు.
Good morning from a dressing room that loves to celebrate each other’s success. 💗 pic.twitter.com/EgHoEjBJ8G
— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2023
ఇక కోల్‌కతా - రాజస్తాన్ మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. లక్ష్యాన్ని రాజస్తాన్ రాయల్స్ 13.1 ఓవర్లలోనే దంచేసింది. ఆ జట్టు యువ సంచలనం యశస్వి జైస్వాల్.. 47 బంతుల్లోనే 13 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 98 పరుగులతో నాటౌట్ గా నిలిచి రాజస్తాన్‌కు ఈజీ విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్.. 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకుని కెఎల్ రాహుల్, పాట్ కమిన్స్ ల పేరిట ఉన్న రికార్డు (14 బంతుల్లో అర్థ సెంచరీ)ను బ్రేక్ చేశాడు.
WTC Final: ఓవల్ సీక్రెట్ ప్యాటర్న్ అదే - రన్స్ కొట్టే టెక్నిక్ చెప్పిన హిట్‌మ్యాన్!
WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే
Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు
Asia Cup: మాకు సాయం చేస్తారనుకుంటే వెన్నుపోటు పొడుస్తారా? - లంక బోర్డుపై పీసీబీ అసంతృప్తి
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ