News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

‘ఇంపాక్ట్’ చూపని ప్లేయర్లు - అన్ని టీమ్స్‌కూ నిరాశే! బౌలర్లైతే దారుణం

IPL 2023: ఐపీఎల్ - 16 ఎడిషన్ నుంచి బీసీసీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ‘ఇంపాక్ట్ ప్లేయర్’. దీని గురించి క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది.

FOLLOW US: 
Share:

Impact Player: గత రెండు సీజన్లలో కరోనాకు తోడు టీఆర్పీ రేటింగ్స్ రాక   ఖాళీ స్టేడియాల్లో జరిగిన మ్యాచ్‌ల వల్ల తీవ్రంగా నష్టపోయిన   బీసీసీఐ.. ఈసారి  ఈ లీగ్‌కు కొన్ని ‘అదనపు హంగులు’ అద్దింది. తద్వారా  ఐపీఎల్ ను రసవత్తరంగా మార్చేందుకు యత్నిస్తున్నది.  ఇందులో భాగంగానే  కొన్ని కొత్త నిబంధనలనూ తీసుకొచ్చింది.  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  ప్రవేశపెట్టిన  వైడ్, నోబాల్ కు డీఆర్ఎస్ తీసుకోవడంతో పాటు  ‘ఇంపాక్ట్ ప్లేయర్’  రూల్  చర్చనీయాంశమైంది.  ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి  సింపుల్ గా చెప్పాలంటే  ఒక మ్యాచ్ లో  12వ ఆటగాడు కూడా  ఆడటం.  కానీ ఏ ప్లేయర్ స్థానంలో అయితే వస్తాడో సదరు ఆటగాడు మాత్రం బెంచ్‌కే పరిమితం కావాలి. మరి  ఈ ‘ఇంపాక్ట్  ప్లేయర్’ గడిచిన  ఐదు మ్యాచ్ లలో మ్యాచ్‌లపై ఏ మేరకు ‘ఇంపాక్ట్’ (ప్రభావం) చూపాడు..?  

బౌలర్లు అట్టర్ ఫ్లాఫ్.. 

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ద్వారా తొలిసారి క్రీజులోకి వచ్చిన  ఆటగాడు  చెన్నె  సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే. అంబటి రాయుడు స్థానంలో వచ్చిన  తుషార్..  గుజరాత్ ఇన్నింగ్స్ లో  3.2 ఓవర్లు వేసి   ఏకంగా  51 పరుగులు ఇచ్చుకున్నాడు.  తద్వారా తొలి మ్యాచ్ లోనే  ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అర్థమే మారిపోయింది.  చెన్నైకి ఇంపాక్ట్ చూపించినదానికంటే తుషార్.. గుజరాత్ ను గెలిపించాడని  చెప్పడం అతిశయోక్తైతే కాదు.   

తుషార్ ఒక్కడే కాదు.. మిగిలిన బౌలర్ల కథ అంతే ఉంది.  పంజాబ్ - కోల్కతా మ్యాచ్ లో  పంబాబ్ తొలుత భానుక రాజపక్సను బ్యాటర్ గా వాడి ఆ తర్వాత  బౌలింగ్ లో రిషి ధావన్ ను తీసుకొచ్చింది.  ఈ మ్యాచ్ లో రిషి.. ఒక్క  ఓవర్ వేసి   15 పరుగులిచ్చాడు.  ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో  రాజస్తాన్.. యశస్వి జైస్వాల్ స్థానంలో  నవ్‌దీప్ సైనీని  ఆడించించి. సైనీ   2 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నాడు.   ఇక  ఆర్సీబీ - ముంబై మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మ.. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో  జేసన్ బెహ్రాండార్ఫ్  ను ఆడించాడు.  ఐపీఎల్ లో ఇతడే తొలి విదేశీ ఇంపాక్ట్ ప్లేయర్.   బెహ్రాండార్ఫ్ కూడా 3 ఓవర్లు వేసి  37 పరుగులిచ్చుకున్నాడు.   మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ముగిసేసరికి   నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్లు (బౌలర్లు)   9.2 ఓవర్లలో  137 పరుగులు  ఇచ్చుకుని ఒక్కటంటే ఒక్కటే వికెట్ తీశారు.  

బ్యాటర్లు  గుడ్డిలో మెల్ల.. 

బౌలర్ల కథ ఇలా ఉంటే బ్యాటర్లు కూడా అంత గొప్ప ప్రదర్శనలు చేయలేదు.   చెన్నైతో మ్యాచ్ లో గుజరాత్.. కేన్ విలియమ్సన్ స్థానంలో  సాయి సుదర్శన్ ను ఆడించింది.   సాయి.. 17 బంతులాడి 22 రన్స్ చేశాడు.   పంజాబ్‌తో మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి  స్థానంలో వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. 28 బంతుల్లో 34 రన్స్ చేశాడు.  సన్ రైజర్స్ హైదరాబాద్.. రాజస్తాన్ తో మ్యాచ్ లో  ఫజుల్లా ఫరూఖీ ప్లేస్ లో అబ్దుల్ సమద్ ను ఆడించింది. అతడు  32 బంతుల్లో 32 రన్స్ చేశాడు.  లక్నోతో మ్యాచ్ లో ఢిల్లీ.. ఖలీల్ అహ్మద్  స్థానంలో  అమన్ ఖాన్ ను ఆడించగా అతడు నాలుగు పరుగులకే ఔటయ్యాడు.    లక్నోతో మ్యాచ్ లో  బదోని స్థానంలో  ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కృష్ణప్ప గౌతమ్ మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ అనే పదానికి కాస్తో కూస్తో న్యాయం చేశాడు. గౌతమ్..  బ్యాటింగ్ లో ఒక బంతి ఆడి సిక్స్ కొట్టాడు. తర్వాత బౌలింగ్ లో నాలుగు ఓవర్లు వేసి  వికెట్లేమీ తీయకున్నా  పొదుపుగా బౌలింగ్ (23 రన్స్) చేశాడు.  

అయితే  ఐపీఎల్ లో జట్లన్నీ  ఒక్క మ్యాచ్ ను మాత్రమే ఆడాయి.  ఐదు మ్యాచ్ లకే ఇంపాక్ట్ ప్లేయర్  రూల్ సక్సెస్ అయిందా లేదా..? అన్నది చెప్పడం   అతిశయోక్తే అవుతుంది గానీ  రాబోయే మ్యాచ్ లలో అయినా ఫ్రాంచైజీలు  ఈ నిబంధనను సరైన ఆటగాళ్లకు ఉపయోగించుకుని  ఫలితాలు రాబడతాయో లేదో వేచి చూడాలి. 

Published at : 03 Apr 2023 06:51 PM (IST) Tags: Navdeep Saini IPL 2023 Jason Behrendorff Indian Premier League 2023 Tushar Deshpande Sai Sudarshan

ఇవి కూడా చూడండి

WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?

WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?

WPL Auction 2024: భారత అమ్మాయిలపై కాసుల వర్షం, కోట్లు దక్కించుకున్న అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు

WPL Auction 2024: భారత అమ్మాయిలపై కాసుల వర్షం, కోట్లు దక్కించుకున్న అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు

India vs England Women : సిరీస్‌ ఇంగ్లాండ్‌ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్‌ చిత్తు

India vs England Women : సిరీస్‌ ఇంగ్లాండ్‌ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్‌ చిత్తు

India vs South Africa : సఫారీలతో తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

India vs South Africa : సఫారీలతో  తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!