Virat Kohli: కోహ్లీ పొగిడితే కొంప కొల్లేరేనా! - అలా అయితే నెక్ట్స్ బలయ్యేది గుజరాత్ ఓపెనరే
IPL 2023: ఐపీఎల్ -16 లో అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లపై విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నాడు.
Virat Kohli: ఐపీఎల్ - 16 లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన మ్యాచ్ లో రాణించాడు. కానీ తర్వాత మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం యశస్వి జైస్వాల్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 13 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. కానీ తర్వాత ఆర్సీబీ తో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు. కానీ నిన్న లక్నోతో మ్యాచ్ లో ఏడు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఈ ముగ్గురి ఔట్ కు ఓ కనెక్షన్ ఉంది.
కోహ్లీ పోస్టు మాయ..
మూడు వేర్వేరు టీమ్స్ కు చెందిన ఈ ముగ్గురి ఔట్‌కు విరాట్ కోహ్లీకి ఓ సంబంధం ఉంది. ఈ ముగ్గురినీ వారి సూపర్ పర్ఫార్మెన్స్ ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశంసలు కురిపించినవాడే. కానీ కోహ్లీ పొగిడిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో ఈ ముగ్గురూ దారుణంగా విఫలమయయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ‘ఇది కోహ్లీ పొగడ్త కాదు. శాపం’అని కామెంట్స్ చేస్తున్నారు.
Kohli curse for real 🤣🤣#IPL2023 #ViratKohli #saha #suryakumar #jaiswal pic.twitter.com/wUH3i6rTp0
— Majharul Hasan 🇧🇩 (@ImMajharulHasan) May 16, 2023
సాహాతో మొదలు..
గుజరాత్ ఓపెనర్ సాహాను పొగిడేంత గొప్ప ఇన్నింగ్స్ ఏం ఆడకపోయినా లక్నో-బెంగళూరు మ్యాచ్ లో గంభీర్, నవీన్ ఉల్ హక్ తో గొడవపడ్డ కోహ్లీ.. ఇందుకు కౌంటర్ గానే సాహాను పొగుడుతూ ఇన్‌స్టాలో స్టోరీ చేస్తూ ‘వాట్ ఎ ప్లేయర్ @వృద్ధి’ అని పోస్ట్ పెట్టాడు. జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్ తర్వాత.. ‘వావ్ నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ లలో ఇది ఒకటి. వాట్ ఎ టాలెంట్ @జైస్వాల్’ అని రాసుకొచ్చాడు. సూర్య సెంచరీ తర్వాత ‘తుల మాన్లా బావు @సూర్యకుమార్’ (హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్) అని రాశాడు.
3 done , On to next one @imVkohli !! pic.twitter.com/7aNPmTXPKg
— 🎰 (@StanMSD) May 16, 2023
నెక్స్ట్ గిల్..
ఈ లెక్కన చూస్తే ఈ జాబితాలో నెక్స్ట్ బలయ్యే ఆటగాడు శుభ్‌మన్ గిల్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గిల్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ తన ఇన్‌స్టాలో.. ‘ఎక్కడ సామర్థ్యం ఉందో అక్కడ గిల్ ఉంటాడు. ఇలాగే ముందుకు సాగుతూ రాబోయే తరాన్ని నడిపించు. గాడ్ బ్లెస్ యూ @శుబ్‌మన్ గిల్’అని రాసుకొచ్చాడు. గత మూడు అనుభవాల దృష్ట్యా గిల్‌కు నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ లో షాక్ తప్పదని సోషల్ మీడియాలో మీమ్స్ వెళ్లువెత్తుతున్నాయి. యాధృశ్చికంగా గుజరాత్ తర్వాత ఆడబోయే మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే కావడం గమనార్హం.