By: ABP Desam | Updated at : 04 Apr 2023 09:27 PM (IST)
డేవిడ్ వార్నర్, అభిషేక్ పొరెల్ ( Image Source : Delhi Capitals Twitter )
DC vs GT 1 Innings Highlight: ఐపీఎల్-16 సీజన్ తొలి మ్యాచ్ లో లక్నోతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంకా ఓటమి మత్తు దిగనట్టుంది. నేడు సొంత గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా ఆ జట్టు బ్యాటర్లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్ల ధాటికి ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 37, 7 పోర్లు), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 36, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (34 బంతుల్లో 30, 2 ఫోర్లు) లు రాణించి గుజరాత్ ఎదుట ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఈ మ్యాచ్ లో కూడా శుభారంభం దక్కలేదు. డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా (5 బంతుల్లో 7, 1 ఫోర్) ఒక ఫోర్ కొట్టినా షమీ వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఊపులో షమీ.. వన్ డౌన్‌లో వచ్చిన మిచెల్ మార్ష్ (4)ను కూడా బౌల్డ్ చేశాడు. షమీ దూకుడు మీదున్నా డేవిడ్ వార్నర్ మాత్రం ధాటిగా ఆడాడు. ఓవర్‌కు ఒక ఫోర్ కొడుతూ ఢిల్లీ స్కోరు పెంచే యత్నం చేశాడు. 37కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి వార్నర్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. హార్ధిక్ పాండ్యా వేసిన ఆరో ఓవర్లో ఈ ఇద్దరూ తలా ఓ బౌండరీ బాదారు. అల్జారీ జోసెఫ్ వేసిన ఏడో ఓవర్‌లో వార్నర్ రెండు ఫోర్లు కొట్టాడు.
జోసెఫ్ జోష్..
సాఫీగా సాగుతున్న ఢిల్లీ ఇన్నింగ్స్‌కు జోసెష్ షాకిచ్చాడు. అతడు వేసిన 9వ ఓవర్ లో మూడో బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో వార్నర్ - సర్ఫరాజ్ ల 30 పరుగలు మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బాల్‌కు రిలీ రూసో (0) కూడా రాహుల్ తెవాటియా పట్టిన అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. పది ఓవర్లు ముగిసేటప్పటికీ ఢిల్లీ చేసిన స్కోరు 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే.
ఆదుకున్న సర్ఫరాజ్.. ఆఖర్లో అక్షర్..
వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన కొత్త కుర్రాడు అభిషేక్ పొరెల్ (11 బంతుల్లో 20, 2 సిక్సర్లు) తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ ఢిల్లీని నడిపించాడు. జోసెఫ్ వేసిన 11వ ఓవర్లో చూడచక్కని సిక్సర్ బాదిన పొరెల్.. యశ్ దయాల్ వేసిన మరుసటి ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా మరో సిక్స్ కొట్టాడు. 12 ఓవర్లకు ఢిల్లీ స్కోరు వంద పరుగులకు చేరింది. కానీ రషీద్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో అభిషేక్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ ఔటయ్యాక వచ్చిన అక్షర్ పటేల్ చివర్లో ధాటిగా ఆడాడు. స్కోరును పెంచే యత్నంలో సర్ఫరాజ్ ఖాన్.. రషీద్ ఖాన్ వేసిన 17వ ఓవర్లో జోషువా లిటిల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు పడుతున్నా అక్షర్ ధాటిగా ఆడుతూ ఢిల్లీ స్కోరును 150 దాటించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ లు తలా మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
IND VS AUS: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాకు కష్టాలు - 30 పరుగులకే ఓపెనర్లు అవుట్!
IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!
IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం