అన్వేషించండి
Shubman Gill: విజయానికి చేరువైన టీమిండియా, గాయంతో గిల్ దూరం
IND vs ENG: ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్న టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్ట్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న స్టార్ శుభ్‌మన్ గిల్‌కు గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది.
![Shubman Gill: విజయానికి చేరువైన టీమిండియా, గాయంతో గిల్ దూరం Injury setback for India star player to miss fourth day of Vizag Test against England Shubman Gill: విజయానికి చేరువైన టీమిండియా, గాయంతో గిల్ దూరం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/ecfb05e5f28eceae16836df32b5685681707115096987872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గాయంతో మ్యాచ్ కి గిల్ దూరం ( Image Source : Twitter )
India vs England, 2nd Test: ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్న టీమిండియా(Team India)కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో కె.ఎల్.రాహుల్(KL Rahul) రవీంద్ర జడేజా(Jadeja) జట్టుకు దూరమవ్వగా రెండో టెస్ట్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న స్టార్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. రెండో రోజు ఆట సందర్భంగా గిల్ కుడి చూపుడు వేలికి గాయమైంది. ఓ వైపు చేతి వేలి నొప్పితో బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో గిల్ చెలరేగాడు. అయితే ఇప్పుడు అతడికి వేలి నొప్పి ఎక్కువగా ఉండడంతో నాలుగో రోజు గిల్ మైదానంలో అడుగుపెట్టలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఫీల్డింగ్‌లో శుబ్‌మన్ చేతి వేలికి గాయమైందని... నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉంటాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. గిల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో మూడో టెస్టు సెంచరీ.
విజయం దిశగా టీమిండియా..
రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 67 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ సమయానికి 194 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంకా విజయానికి బ్రిటీష్ జట్టు 205 పరుగుల దూరంలో ఉంది. క్రాలే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులు చేసిన క్రాలేను కుల్‌దీప్ అవుట్ చేశాడు. ఎల్బీ కోసం టీమిండియా అప్పీలు చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. డీఆర్‌ఎస్ తీసుకున్న భారత్‌కు ఫలితం సానుకూలంగా వచ్చింది. దీంతో 194 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్‌ను నష్టపోయింది. వెంటనే ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో బెయిర్ స్టో ఎల్బీగా ఔట్ అయ్యాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ డీఆర్‌ఎస్ తీసుకుంది. సమీక్షలోనూ ‘అంపైర్స్ కాల్’ రావడంతో బెయిర్‌స్టో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ 127 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా 4 వికెట్లు మాత్రమే అవసరం. ఇంగ్లాండ్ గెలిచేందుకు 205 పరుగులు కావాలి. తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ఓలీ పోప్ క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో 23 పరుగులు చేసిన ఓలీ పోప్ ఔటయ్యాడు.
యశస్వీ పేరిట రికార్డులే రికార్డులు
వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ... అజేయ ద్వి శతకంతో టీమిండియాను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. యశస్వి జైస్వాల్ ద్వి శతకంతో టీమిండియా ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. 290 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్...19 ఫోర్లు, 7 సిక్సులతో 209 పరుగులు చేసి అవుటయ్యాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ మూడు, బషీర్ మూడు, అహ్మద్ మూడు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ ముందు టీమిండియా 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion