Rohit Sharma: అభిమానులను నెట్ సెషన్లకు రాకుండా నిషేధించడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక కామెంట్స్
Rohit Sharma News: ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యి ప్లేయర్లకు జోష్ నిచ్చే భారత అభిమానులకు తాజాగా షాక్ తగిలింది. ఇకపై ప్రాక్టీస్ సెషన్లకు రాకుండా టీమ్ మేనేజ్మెంట్ నిషేధం విధించింది.
Ind Vs Aus Test Series: భారత క్రికెటర్లంటే అభిమానులకు ఎంతో అభిమానం. మనదేశపు క్రికెటర్లు ఎక్కడ మ్యాచ్ లాడిన అక్కడికి వస్తూ, మద్దతునిస్తుంటారు. విదేశాల్లో ఆడినా కూడా భారత అభిమానుల మద్దతు చూసి అక్కడి క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతుంటారు. తాము ఆడుతున్నది తమ దేశంలోనా.. లేక భారతగడ్డపైనా అని.. ఆ రేంజ్ లో భారత అభిమానులు క్రికెటర్లను బ్యాక్ చేస్తారు. క్రికెట్ ఆడుతున్న అన్ని దేశాల్లో భారత అభిమానులు స్టేడియాలకు వచ్చి మద్దతు పలుకుతూంటారు. అయితే మ్యాచ్ లతోపాటు ప్రాక్టీస్ సెషన్లకు కూడా ఫ్యాన్స్ హాజరవుతుంటారు. తమ అభిమాన క్రికెటర్లను దగ్గరగా చూడటం కోసం తెల్లవారుజాము నుంచే స్టేడియంల వద్ద పడిగాపులు పడుతుంటారు. అయితే అలాంటి అభిమానులను ప్రాక్టీస్ సెషన్లకు హాజరు కాకుండా టీమిండియా యాజమాన్యం ప్రస్తుతం నిషేధం విధించింది.
Also Read: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
బీజీటీ నుంచే షురూ..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) నుంచే ఈ సంప్రదాయం అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా రెండో టెస్టు జరిగిన అడిలైడ్ స్టేడియం నుంచి టీమ్ మేనేజ్మెంట్ ఈ అదేశాలు జారీ చేసింది. దీనిపై ఫ్యాన్స్ దిగులు చెందుతున్నారు. అయితే వారికి క్లారిటీ ఇవ్వడం కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా మనసులోని మాట చెప్పాడు. ప్రాక్టీస్ సెషన్లో తాము రకరకాల ప్రణాళికల గురించి డిస్కస్ చేస్తుంటామని, అలాగే కొత్త కొత్త టెక్నిక్ లను సాధన చేస్తుంటామని తెలిపాడు. ఈ క్రమంలో చాలా ఏకాగ్రత అవసమరని రోహిత్ వెల్లడించాడు. అయితే స్టేడియంలోని ప్రేక్షకుల మాటల వల్ల ఏకాగ్రత చెదరడం వల్ల ప్రాక్టీస్ సెషన్లో ఇబ్బందులు ఎదరవుతున్నాట్లు పేర్కొన్నాడు. అందువల్లనే టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఖాళీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తేనే మరింత మెరుగుగా సాధన చేయవచ్చని పేర్కొన్నాడు.
మ్యాచ్ లకు రండి..
తమను దగ్గరగా చూడాలనుకునే ప్రేక్షకులు మ్యాచ్ లకు రావాలని రోహిత్ శర్మ సలహా ఇచ్చాడు. టెస్టులు ఐదు రోజులు జరుగుతాయని, వీలున్నప్పుడు ఏదో ఒక రోజు వచ్చి తమను చూడవచ్చని, అంతే గానీ ప్రాక్టీస్ సెషన్లకు వచ్చి రకరకాల నినాదాలతో తమ ఏకాగ్రతకు భంగం కలిగించవద్దని పరోక్షంగా తెలిపాడు. నిజానికి అడిలైడ్ లో భారత ప్రాక్టీస్ సెషన్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే ప్రేక్షకుల్లోని కొంతమంది రోహిత్, రిషభ్ పంత్ బరువులపై కామెంట్ చేసినట్లు సమాచారం. దీని వెనుక యాంటి ఫ్యాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీని వల్ల హర్టయిన ప్లేయర్లు.. ఫిర్యాదు చేయగా టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. అయితే తాజాగా రోహిత్ శర్మ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. చూశారుగా ఫ్యాన్స్.. మీ అభిమాన క్రికెటర్లను చూడాలనుకుంటే అటు పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు గానీ, ఇటు టెస్టులకు గానీ హాజరు కావచ్చు. ఇక ఆసీస్ లో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు ఈనెల 14 నుంచి బ్రిస్బేన్ లో జరుగుతుంది. 26న మెల్బోర్నలో నాలుగో టెస్టు, జనవరి 3న సిడ్నీలో ఐదో టెస్టు జరుగుతుంది.
Also Read: కోహ్లీ, రోహిత్ సత్తా చాటాల్సిందే - గత కాలపు ఘనతలతో ప్రస్తుతం చోటు ఆశించలేరు, మాజీల వార్నింగ్