అన్వేషించండి

IND vs PAK 2022: పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే చాలు కోహ్లీ ఆట వేరే లెవల్‌లో ఉంటుంది

IND vs PAK 2022: టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

T20 World Cup 2022: విరాట్ కోహ్లీని క్రికెట్ మైదానంలో 'చేజ్ మాస్టర్' అని పిలుస్తారు. చాలా సార్లు దీన్ని రుజువు చేశాడు కోహ్లీ. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి చేజింగ్ స్టార్‌ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి టీమ్ ఇండియాను గెలిపించాడు. పాకిస్తాన్‌పై తాను ఆడిన  ఇన్నింగ్స్‌ను అత్యుత్తమమైనదిగా విరాట్ కోహ్లీ అభివర్ణించాడు. దీనికి ముందు 2016 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను అత్యుత్తమమైనదిగా భావించాడు.

పాకిస్థాన్‌పై కోహ్లీ 308 సగటు

టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 300 దాటింది. వాస్తవానికి టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ రికార్డు గురించి మాట్లాడితే.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 5సార్లు ఆడాడు. కానీ పాకిస్తాన్ బౌలర్లు ఈ భారత మాజీ కెప్టెన్‌ను ఒక్కసారి మాత్రమే అవుట్ చేయగలిగారు. గత ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో విరాట్ కోహ్లీని షాహీన్ అఫ్రిది ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. విరాట్ కోహ్లీ 2012 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పై 78 పరుగులు చేశాడు. 2014, 2016లో వరుసగా 36, 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

టీ20 వరల్డ్‌కప్‌ 2021లో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడినప్పుడు విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో 57 పరుగులు చేశాడు.  టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఈ సమయంలో భారత మాజీ కెప్టెన్ సగటు 308గా ఉంది. స్ట్రైక్ రేట్ 132.75గా ఉండగా.. అయితే పాకిస్తాన్‌పై కోహ్లీ బ్యాటింగ్ సగటు పరంగా చూస్తే డాన్ బ్రాడ్ మాన్‌ను మించిపోయాడు కోహ్లీ. టీ20 వరల్డ్‌కప్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ సగటు 270.50గా ఉంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 22 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 541 పరుగులు చేశాడు.

ఓటమి అంచుల వరకు వెళ్లిన మ్యాచ్ ను టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) తన అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 తొలి సూపర్‌ 12 మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్ పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ తో చెలరేగుతున్నారు. 

ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్‌ మసూద్‌ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ 159/8కి పరిమితమైంది. తడబడుతూ ఛేజింగ్ చేసిన భారత్ 10 ఓవర్లకు 45-4 గా ఉంది. కానీ హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మ్యాచ్ ను 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు విజయానికి 16 రన్స్‌ కావాలి. పాండ్యా ఔటైనా, విరాట్ కోహ్లీ నోబాల్ ను సిక్సర్ గా మలవడం, ఫ్రీహిట్‌ బంతికి 3 పరుగులు తీశారు. చివరి బంతికి సింగిల్ తీసి భారత్ అపూర్వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ మాజీ క్రికెటర్లతో పాటు తోటి ఆటగాళ్లు విరాట్ బ్యాటింగ్ ను ప్రశంసించారు.

ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి ముగింపు వరకు టీమ్‌ఇండియా క్రికెటర్లు, అభిమానులు ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. జయహే.. జయహే అంటున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. భారత్‌ 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు హిట్‌మ్యాన్‌ కుర్రాడు. అప్పట్నుంచి చాలా ప్రపంచకప్‌లు ఆడాడు. ఈ సారి కెప్టెన్సీ చేస్తున్నాడు. అతడి వయసు ఇప్పుడు 35. మహా అయితే రెండేళ్లు ఆడగలడు. అందుకే తన నాయకత్వంలో ప్రపంచకప్‌ గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు.

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య నాయకత్వ విభేదాలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఇద్దరి అభిమానులు పరస్పరం వాదోపవాదాలకు దిగుతుంటారు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్‌ మధ్య బ్రొమాన్స్‌ చూస్తే అలా అనిపించదు. విజయం అందించిన వెంటనే హిట్‌మ్యాన్‌ పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చాడు. విరాట్‌ను ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. బిగ్గరగా హత్తుకున్నాడు. ఈ సీన్‌ చూస్తున్న కోట్లాది మంది థ్రిల్‌ అయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru | ఆర్సీబీ బౌలర్ల తడా ఖా.. వణికిపోయిన SRH | ABPYS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |Pawan Kalyan on YS Jagan | కోస్తా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ అంటున్న పవన్ | ABP DesamGoogle Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Embed widget