అన్వేషించండి

Rohit Sharma Comments: కోహ్లీకి ఆ బలహీనతను ఎలా అధిగమించాలో తెలుసు- మీరే చూస్తారుగా: రోహిత్ శర్మ

Melbourne Test: అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నడూ లేని విధంగా కోహ్లీ.. ఈసారి ఆసీస్ గడ్డపై ఇబ్బంది పడుతున్నాడు. పదే పదే ఒకే విధంగా ఔట్ కావడంపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. 

Ind Vs Aus 4Th Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. మూడు టెస్టులు కలిపి మొత్తం ఐదు ఇన్నింగ్స్ లలో బరిలోకి దిగిన కోహ్లీ.. ఒక పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనే అజేయ సెంచరీ చేశాడు. అదే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేసిన కోహ్లీ.. అడిలైడ్ లో వరుసగా 7, 11 పరుగులు చేశాడు. ఇక డ్రాగా ముగిసిన బ్రిస్బేన్ టెస్టులో 3 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. పదే పదే ఆఫ్ స్టంప్ దాటి వెళుతున్న బంతిని వేటాడి తను ఔటవుతున్నాడు. ఆసీస్ పేసర్లు పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, స్కాట్ బోలాండ్ పదే పదే ఆఫ్ స్టంప్ పై ఊరించే బంతులు వేసి కోహ్లీని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పదే పదే ఒకే విధంగా విరాట్ ఔట్ కావడం చూసి అభిమానులు నిరాశ పడుతున్నారు. తాజాగా దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 
 
అధిగమిస్తాడు..
రాబోయే రెండు టెస్టుల్లో కోహ్లీ.. ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమిస్తాడని రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ మోడర్న్ క్రికెట్ లెజెండ్ అని, ఇలాంటి బలహీనతలను ఎలా అధిగమించాలో తనకు తెలుసని వ్యాఖ్యానించాడు. మరోవైపు జట్టు బ్యాటింగ్ ఆర్డర్ గురించి కూడా చర్చించాడు. నిజానికి ఓపెనర్ గా బరిలోకి దిగాల్సిన రోహిత్.. జట్టు అవసరాల రిత్యా ఆరో నెంబర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనిపై స్పందిస్తూ, జట్టుకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్నే చేస్తామని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు గురించి టీమ్ మేనేజ్మెంట్ కు అవగాహన ఉందని చెప్పుకొచ్చాడు. మరోవైపు అంతగా ఆకట్టుకోని రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ గురించి మాట్లాడాడు. జట్టులో ఎవరి నుంచి ఏం కావాలో స్పష్టంగా తెలుసని, ఎక్కువగా మాట్లాడి వారిపై ఒత్తిడి పెట్టబోమని తెలిపాడు. చిన్న చిన్న మార్పులు మాత్రం సూచిస్తామని వెల్లడిచాడు. 

Also Read: 2036 Olympics: ఇండియాలో 2036 ఒలింపిక్స్!.. నిర్వహణకు వేగంగా పావులు కదుపుతున్న కేంద్రం.. ఆల్రెడీ హోస్ట్ సిటీ ఎంపిక!

బుమ్రా భేష్..
ఇక ఈ సిరీస్ లో సత్తా చాటుతున్న స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాపై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. జట్టుకు ఏం కావాలో బుమ్రాకు తెలుసని, తనతో ఈ విషయాన్ని ఎవరు పంచుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా తన ప్రణాళికలతో వికెట్లు తీయడం బుమ్రాకు అలవాటుగా మారిందని కొనియాడాడు. ఫీల్డులో బౌలింగ్ కు సంబంధించి బుమ్రాకు తానేమీ సూచనలు చేయబోనని, పరిస్థితులకు తగినట్లుగా అతనే బౌలింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. అతనో అద్భుతమైన బౌలరని కితాబిచ్చాడు. ఈనెల 26 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగోదైన బాక్సింగ్ డే టెస్టు మెల్ బోర్న్ వేదికగా జరగబోతోంది. సిరీస్ లో తొలి మ్యాచ్ ను భారత్ నెగ్గగా, రెండో మ్యాచ్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

Also Read: Pujara Comments: టీమిండియా అందులో బలహీనంగా ఉంది.. సరి చేసుకుంటేనే సిరీస్ లో ముందంజ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
First Pan India Movie: సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డు... రజనీ, నాగార్జున హీరోలు... ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?
సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డు... రజనీ, నాగార్జున హీరోలు... ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?
Telugu Serial Actress: గుడ్ న్యూస్ షేర్ చేసిన పద్మిని, అజయ్... పండంటి బిడ్డకు జన్మ ఇచ్చిన వైదేహి పరిణయం సీరియల్ నటి
గుడ్ న్యూస్ షేర్ చేసిన పద్మిని, అజయ్... పండంటి బిడ్డకు జన్మ ఇచ్చిన వైదేహి పరిణయం సీరియల్ నటి
Ban On Medicine: పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, బరిలో నిలిచేది ఎవరో..
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, బరిలో నిలిచేది ఎవరో..
Embed widget