(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL 2ND T20: ఆ యువ బౌలర్ ను వెంటాడుతున్న నోబాల్స్- ఇలా అయితే కష్టమే!
IND vs SL 2ND T20: అర్హదీప్ సింగ్... అతి తక్కువ కాలంలోనే టీ20 ఫార్మాట్లో టీమిండియాకు కీలక బౌలర్ గా మారాడు. అయితే నోబాల్స్ వేసే తన బలహీనతను అధిగమించలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.
IND vs SL 2ND T20: అర్హదీప్ సింగ్... అతి తక్కువ కాలంలోనే టీ20 ఫార్మాట్లో టీమిండియాకు కీలక బౌలర్ గా మారాడు. అరంగేట్రం చేసి 6 నెలలే అవుతున్నా.. తన ఎడమచేతి వాటం బౌలింగ్ తో భారత్ కు ప్రధాన బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ పేసర్ తన బలహీనతను ఒకదాన్ని పోగొట్టుకోలేక సతమవుతున్నాడు. ప్రస్తుతం దానివలనే కోరుకోని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటో తెలుసుకోండి.
ఎంతో ప్రతిభ ఉన్న అర్హదీప్ సింగ్ టీమిండియా తరఫున 6 నెలల క్రితం అరంగేట్రం చేశాడు. మంచి పేస్ బౌలింగ్ తో తక్కువ కాలంలోనే నమ్మదగ్గ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే తరచుగా నోబాల్స్ వేసే తన బలహీనతను అతను వదులుకోలేకపోతున్నాడు. ఇప్పుడు దానివలనే ఒక కోరుకోని రికార్డను అర్హదీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు నోబాల్స్ వేయడం సాధారణం. అయితే అర్హదీప్ 6 నెలల కాలంలోనే టీ20 ఫార్మాట్ లో 14 నోబాల్స్ వేశాడు. పాక్ పేసర్ హసన్ అలీ రికార్డును అతను అధిగమించాడు. అంతేకాదు ఒకే ఓవర్లో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన భారత బౌలర్ గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
హ్యాట్రిక్ నోబాల్స్
నిన్న జరిగిన భారత్- శ్రీలంక మ్యాచ్ లో అర్హదీప్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ కోటాలోనే 5 నోబాల్స్ వేశాడు. అందులో 2 బంతులకు శ్రీలంక బ్యాటర్లు 4, 6 బాదారు. అర్హదీప్ మ్యాచ్ లో రెండో ఓవర్ వేశాడు. ఆ ఓవర్లోనే 3 హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. ఆ ఓవర్ లో 19 పరుగులు ఇచ్చాడు. అర్హదీప్ పేలవ బౌలింగ్ కారణంగా శ్రీలంక తొలి 5 ఓవర్లలోనే 49 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ 19వ ఓవర్ బౌలింగ్ కు వచ్చిన అతను 2 నోబాల్స్ వేశాడు. దీంతో కేవలం 2 ఓవర్లలోనే 37 పరుగులు సమర్పించుకున్నాడు.
మంచి పేస్, వేగం కలగలిపిన బంతులతో అర్హదీప్ ప్రత్యర్థులను హడలెత్తించగలడు. అలాగే పవర్ ప్లే ఓవర్లలోనూ ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడు. అయితే నోబాల్స్ వేసే తన బలహీనతను అధిగమించకపోతే అది ఈ యువ బౌలర్ కెరీర్ ను ప్రమాదంలో పడేసే అవకాశాలు లేకపోలేదు. ప్రతి పరుగు ఎంతో విలువైన టీ20 క్రికెట్ లో ఒక్క నోబాల్ మ్యాచ్ గతినే మార్చేయగలదు. కాబట్టి అర్హదీప్ తన బలహీనతను ఎంత త్వరగా అధిగమిస్తే అంత బాగా రాణించగలడు.
Arshadeep singh na srilanka ka khilaf 5 no balls dali or khabar samna arahi ha ka match fixing ki hai🙄😮 #ArshadeepSingh #umranmalik #PakvsNz #120mm #120mm #AsiaCup2023 pic.twitter.com/HBvjbgRul2
— Zain Sh (@ZainSh58449559) January 5, 2023
#noball #INDvSL Arshadeep singh : 1st no ball
— Bhavik oza (@bhavikoza_) January 5, 2023
Hardik pandya : koi bat nahi koi bat nahi
Arshadeep: 2nd no ball
Hardik : abe thoda dhyan se
Arshadeep:3rd no ball
Hardik : abe kya kar raha he tu
Arshadeep: muje bola tha jivan me line se aage badho badh gya 😂
Hardik : ,🤬🤬 pic.twitter.com/tTqgtg7mRw