అన్వేషించండి
Advertisement
Ind Vs Sa final: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్, ఇక భారమంతా కింగ్ కోహ్లీపైనే
india vs south africa :కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. ఒకే ఓవర్లో డబుల్ షాక్రో హిత్ శర్మ, రిషభ్ పంత్ అవుట్ కదా తరువాత సూర్య కుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరాడు
india vs south africa live updates: టీ 20 ప్రపంచకప్ కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. ఒకే ఓవర్లో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ, రిషభ్ పంత్‌ను అవుట్ చేసిన కేశవ్ మహరాజ్ టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కాసపేటికే సూర్య కుమార్ యాదవ్ కూడా అవుట్ కావడంతో భారత జట్టు 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాపార్డర్ కుప్పకూలడంతో ఇక భారమంతా మిడిల్ ఆర్డర్‌పైనే ఉంది. సెమీస్ వరకూ అన్ని మ్యాచుల్లో వరుసగా విఫలమైన కింగ్ కోహ్లీపైనే ఇప్పుడు బ్యాటింగ్ భారం పడింది. మిడిల్ ఆర్డర్‌తో కలిసి కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడే క్రీజులోకి అడుగుపెట్టిన అక్షర్ పటేల్.. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది.
రెండు జట్లు బలంగానే
ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఇరు జట్లు అజేయంగా ఫైనల్‌కు చేరాయి. రోహిత్ శర్మ జట్టు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లపై గెలిచి ఫైనల్ చేరింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. ఫైనల్ వెళ్లే మార్గంలో ప్రోటీస్ అనేక మ్యాచుల్లో ఓటమిని తృటిలో తప్పించుకుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, నేపాల్ జట్లు కూడా ప్రొటీస్‌కు సవాలు విసిరాయి. ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు ఓటమి దశ నుంచి కోలుకుని సౌతాఫ్రికా విజయం సాధించింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడం ద్వారా ప్రొటీస్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించనున్నారు. అనుకున్నట్లుగానే కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు.
ప్రపంచం చూపంతా ఈ మ్యాచ్‌పైనే
ఈ పొట్టి వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి మరోసారి టీ 20 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టాలని టీమిండియా.. తొలిసారి వరల్డ్‌కప్ ఫైనల్ గెలవాలన్న పట్టుదలతో సఫారీ జట్టు ఉన్నాయి. కోట్లాది మంది అభిమానుల అంచనాలను నిజం చేయాలని కూడా రోహిత్ సేన భావిస్తోంది. టీమిండియా టైటిల్ పోరును అంత తేలిగ్గా అవకాశమే లేదు. దశాబ్దం నాటి కలను సాకారం చేసుకోవాలని టీమిండియాలోని ప్రతీ ఆటగాడు పట్టుదలతో ఉంది. కోహ్లీ ఎలా ఆడతాడన్న దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. విరాట్ మరోసారి విశ్వరూపం దాలిస్తే మాత్రం టీమిండియా గెలుపు అంత కష్టమేమీ కాదు. కీలకమైన మ్యాచుల్లో కోహ్లీలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడు. అదే మళ్లీ జరిగితే ప్రొటీస్‌కు కష్టాలు తప్పవు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement