IND vs NZ ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్- అర్హదీప్, ఉమ్రాన్ మాలిక్ వన్డే అరంగేట్రం
భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందనే ఫీల్డింగ్ ఎంచుకున్నామని కివీస్ కెప్టెన్ అన్నాడు.
IND vs NZ ODI: భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందనే ఫీల్డింగ్ ఎంచుకున్నామని కివీస్ కెప్టెన్ అన్నాడు. తాము నలుగురు పేసర్లతో ఆడుతున్నట్లు చెప్పాడు.
'ఇది అద్భుతమైన పిచ్. మొదట బ్యాటింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. యువకులందరికీ తమ ప్రతిభ కనబర్చేందుకు ఇదో మంచి అవకాశం. మేము ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉండండ అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మ్యాచ్ తో అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు అరంగేట్రం చేయబోతున్నారు.' అని ధావన్ చెప్పాడు. టీ20 సిరీస్ లో ఆడని సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకున్నారు.
భారత తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ తుది జట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్.
🚨 Toss Update from Auckland 🚨
— BCCI (@BCCI) November 25, 2022
New Zealand have elected to bowl against #TeamIndia in the first #NZvIND ODI.
Follow the match 👉 https://t.co/jmCUSLdeFf pic.twitter.com/LUx0Ws1ikG
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను 1-0తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ కు సిద్ధమైంది. ధావన్ నాయకత్వంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. నేడే తొలి మ్యాచ్. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, జడేజా, హార్దిక్ పాండ్య లాంటి సీనియర్లు లేకుండా భారత్ బరిలో దిగనుంది. కుర్రాళ్లతో నిండిన జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం. మరో 11 నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత్‌తో పాటు న్యూజిలాండ్ కూడా ఈ సిరీస్‌తోనే సన్నాహకాలు మొదలుపెట్టనుంది.
వారు లేకపోయినా బలంగానే
అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోయినా టీమ్‌ఇండియా బలంగానే ఉంది. వన్డేలు మాత్రమే ఆడుతున్న శిఖర్ ధావన్ సారథిగా.. బ్యాటర్‌గా నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. 2022లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌ల్లో 75.71 సగటుతో 530 పరుగులు చేశాడు. ధావన్, గిల్ జోడీ ఎనిమిది వన్డేల్లో మూడు సార్లు శతక భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం. ఆ తర్వాత శ్రేయస్, సూర్యకుమార్, పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌తో మిడిలార్డర్ పటిష్ఠంగా ఉంది. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవాళ్లే కావడంతో లోయరార్డర్ కూడా బాగానే ఉంది. 20ల్లో ధనాధన్ ఆటతీరుతో అదరగొడుతున్న సూర్యకుమార్ వన్డేల్లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ భారాన్ని మోయనున్నారు. అర్ష్‌దీప్ వన్డే అరంగేట్రం చేయనున్నాడు. స్పిన్నర్లుగా కుల్దీప్, చాహల్ లలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
ప్రతీకారం తీర్చుకుంటుందా!
వన్డే ఫార్మాట్ లో న్యూజిలాండ్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. టీ20 సిరీస్ కోల్పోయిన కివీస్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటుంది. 2020లో ఇలాగే మొదట 0-5తో టీ20 సిరీస్ కోల్పోయిన ఆ జట్టు.. అనంతరం వన్డేల్లో 3-0తో భారత్‌ను వైట్‌వాష్ చేసింది. అందుకే ప్రత్యర్థితో జాగ్రత్తగా ఉండాలి. చివరి టీ20కి దూరమైన కెప్టెన్ విలియమ్సన్ తిరిగి జట్టుతో చేరాడు. తనకు సరిగ్గా నప్పే వన్డే ఫార్మాట్లో చెలరేగాలని చూస్తున్నాడు. లేథమ్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. మ్యాట్ హెన్రీ పేస్ విభాగం బాధ్యతలు మోయనున్నాడు. అతనికి భారత్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ 6 వన్డేల్లో 17.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. స్పిన్నర్ శాంట్నర్ కీలకంగా మారనున్నాడు. వన్డేల్లో అతని ఎకానమీ చాలా తక్కువగా ఉంది. అతనితో మన బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే.
పిచ్ పరిస్థితి
ఈడెన్ పార్క్ మైదానం చిన్నగా ఉంటుంది. పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకరించొచ్చు. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 217 పరుగులుగా ఉంది. అయితే క్రీజులో కుదురుకుంటే భారీస్కోర్లు సాధ్యమే. చివరగా ఇక్కడ ఆడిన వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో ఓడింది. ఛేదన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. వర్షం పడే సూచనలు లేవు.
ఇది మీకు తెలుసా
కివీస్‌తో ఆడిన 110 వన్డేల్లో టీమ్‌ఇండియా సాధించిన విజయాలు. 49 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి గెలిచింది. ఓ మ్యాచ్ టై కాగా.. అయిదింట్లో ఫలితం తేలలేదు.
India is set to face New Zealand in their 1st ODI of the series 🏏#crickettwitter #india #newzealand #indvsnz pic.twitter.com/4WIA7uXMWB
— Sportskeeda (@Sportskeeda) November 25, 2022