India vs Ireland T20I: భారత్ vs ఐర్లాండ్ టీ20 సమరం - ఈ యాప్‌లో ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్!
India vs Ireland T20I: వెస్టిండీస్ సిరీస్ తర్వాత టీమ్‌ఇండియా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీసులో తలపడుతోంది. ఈ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు, సిరీస్ టైమింగ్, వేదిక, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!
India vs Ireland T20I:
వెస్టిండీస్ సిరీస్ తర్వాత టీమ్‌ఇండియా మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీసులో తలపడుతోంది. పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టే డబ్లిన్‌కు వెళ్లడంతో అభిమానుల్లో ఇంట్రెస్ట్ నెలకొంది. పైగా కొన్ని నెలల పాటు మైదానానికి దూరమైన జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అందుబాటులో లేకపోవడంతో కొత్త కోచ్ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు, సిరీస్ టైమింగ్, వేదిక, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీ కోసం!
IND vs IRE T20 సిరీస్ ఎప్పుడు మొదలవుతుంది?
IND vs IRE T20 సిరీస్ ఆగస్టు 18 నుంచి మొదలవుతుంది.
IND vs IRE T20 మ్యాచులు ఎక్కడ జరుగుతున్నాయి?
IND vs IRE T20 మ్యాచులు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరుగుతున్నాయి. వేదిక మలహైడ్.
IND vs IRE T20 సిరీస్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ ఎందులో?
IND vs IRE T20 సిరీస్ జియో సినిమా యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. టెలికాస్టింగ్ స్పోర్ట్స్ 18లో అందుబాటులో ఉంది.
IND vs IRE T20 మ్యాచులు టైమింగ్ ఏంటి?
IND vs IRE T20 మ్యాచులు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతాయి. భారత్‌లో రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతాయి. అరగంట ముందు టాస్ వేస్తారు.
IND vs IRE T20 సిరీస్ పూర్తి షెడ్యూలు
ఆగస్టు 18, 2023: డబ్లిన్‌లో మొదటి టీ20
ఆగస్టు 20, 2023: డబ్లిన్‌లో రెండో టీ20
ఆగస్టు 23, 2023: డబ్లిన్‌లో మూడో టీ20
IND vs IRE T20 సిరీస్‌కు భారత జట్టు
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్
IND vs IRE T20 సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్‌బిర్నే, రాస్ అడైర్, హ్ఆయరీ టెక్టార్, గరేత్ డిలానీ, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, ఫిన్ హ్యాండ్, లార్కన్ టక్కర్, మార్క్ అడైర్, జోషువా లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, థియో వాన్ వూర్‌కామ్, బెంజమిన్ వైట్, క్రెయిగ్ యంగ్