అన్వేషించండి

Sarfaraz Khan: రెండో ఇన్నింగ్స్‌లోనూ దూకుడే , సర్ఫరాజ్‌ అరుదైన ఘనత

India vs England: వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకం సాధించి సర్ఫరాజ్‌ ఖాన్‌ సత్తా చాటాడు. కేవలం 72 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో 68 పరుగులు చేసి సత్తా చాటాడు.

Sarfaraz Khan has become an instant crowd favourite: రాజ్‌కోట్‌ టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌(England)పై ఏకంగా 434  పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్‌ ద్వి శతక గర్జనతో బ్రిటీష్‌ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో  434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. మూడో రోజు ఆటకు అర్ధాంతరంగా దూరమైన అశ్విన్‌ తిరిగి జట్టులోకి వచ్చి వికెట్‌ సాధించగా... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకం సాధించి సర్ఫరాజ్‌ ఖాన్‌ సత్తా చాటాడు. కేవలం 72 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో 68 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అర్ధ శతకాలు సాధించిన సర్ఫరాజ్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

సర్ఫరాజ్‌ రికార్డు
అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా సర్ఫరాజ్‌ ఖాన్ నిలిచాడు. దిలావర్‌ హుస్సేన్, సునీల్ గావస్కర్, శ్రేయస్‌ అయ్యర్ ఈ ఘనత సాధించాడు. దూకుడైన ఆటతీరుతో భారత జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌కు ‘బజ్‌బాల్‌’ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో సర్ఫరాజ్‌ హోరెత్తించాడు. యశస్వితో కలిసి కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ, సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నారు. 
తొలి ఇన్నింగ్స్‌లో ఇలా
దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్నా జట్టులో చోటు కల్పించడం లేదని అభిమానుల ఆవేదన, మైదానంలో అగ్రెసీవ్‌గా ఉంటాడు కాబట్టే భారత జట్టులో చోటు దక్కడం లేదని ఊహాగానాలు. టెస్ట్‌ జట్టు ప్రకటించే ప్రతీసారి.. ఈసారి జట్టులో చోటు పక్కా అనే వార్తలు. అసలు జట్టులోకి వస్తే రాణిస్తాడా... లేక చాలామంది ఆటగాళ్లలాగే అంచనాలు అందుకోలేక చతికిల పడతాడా అని... వీటన్నింటికి ఒకే ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్‌ ఖాన్‌( Sarfaraz Khan) సమాధానం చెప్పేశాడు. వన్డే తరహా ఆటతో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు. తన ఎంపిక సరైందేనని... తనలో అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లో రాణించే సత్తా ఉందని సర్ఫరాజ్ నిరూపించుకున్నాడు. అంతేనా తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించి రికార్డు కూడా సృష్టించాడు.
 
సాధికార బ్యాటింగ్‌
క్రీజులోకి వచ్చినప్పటి  నుంచి సర్ఫరాజ్‌ ఖాన్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన టెస్టులో వేగంగా అర్ధ శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా సర్ఫరాజ్ ధాటిగానే ఆడుతున్నాడు. 66 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో సర్ఫరాజ్‌ సింగిల్‌ కోసం యత్నించి రనౌట్‌ అయి నిరాశగా వెనుదిరిగాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
HMDA Latest News : హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
HMDA Latest News : హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Telangana Latest News : ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
Anantapur News: గిరిజనుల భూములు కబ్జా చేసిన బీజేపీ నేతపై సీఎంకు ఫిర్యాదు - చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ !
గిరిజనుల భూములు కబ్జా చేసిన బీజేపీ నేతపై సీఎంకు ఫిర్యాదు - చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ !
Telangana Latest News: దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
Viral News: ఆన్ లైన్‌లో కన్యాత్వాన్ని అమ్మేసి 18 కోట్లు సంపాదించింది - ఆ విద్యార్థిని చేసిన పని మంచిదేనా ?
ఆన్ లైన్‌లో కన్యాత్వాన్ని అమ్మేసి 18 కోట్లు సంపాదించింది - ఆ విద్యార్థిని చేసిన పని మంచిదేనా ?
Embed widget