అన్వేషించండి
India vs England: నేటి నుంచే హైదరాబాద్ టెస్ట్ టికెట్ల విక్రయం
India vs England: హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 25న జరగనున్న భారత్ - ఇంగ్లాండ్ తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి.
![India vs England: నేటి నుంచే హైదరాబాద్ టెస్ట్ టికెట్ల విక్రయం India vs England Hyderabad match tickets go on sale from 18 January India vs England: నేటి నుంచే హైదరాబాద్ టెస్ట్ టికెట్ల విక్రయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/18/948bccf9baf3db77cd4ac5d75db8191c1705554815230872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నేటి నుంచే హైదరాబాద్ టెస్ట్ టికెట్ల విక్రయం( Image Source : Twitter )
హైదరాబాద్(Hyderabad) ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 25న జరగనున్న భారత్ - ఇంగ్లాండ్(India versus England) తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. సాయంత్రం ఏడు గంటల నుంచి పేటీఏం ఇన్‌సైడర్ మొబైల్ యాప్‌తో పాటు ఇన్ సైడర్ వెబ్ సైట్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( Hyderabad Cricket Association )తెలిపింది. మిగిలిన టిక్కెట్లను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మనున్నట్లు ప్రకటించింది. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్‌ని తిలకించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకాశం కల్పించింది. రిపబ్లిక్ డే రోజున భారత సాయుధ దళాల సిబ్బందికి సైతం అవకాశమిచ్చింది. టెస్టు మ్యాచ్ టిక్కెట్ ధరలు 200 నుంచి 4 వేల రూపాయల వరకు నిర్ణయించారు.
కనిష్టం రెండు రూ.200...
భారత్, ఇంగ్లాండ్( IND Vs ENG) మధ్య తొలి టెస్టు మ్యాచ్‌కు నేటి నుంచి టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లను పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో విక్రయించనున్నారు. మిగిలిన టికెట్లను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటు జింఖానాలో అమ్ముతారు. కనీస టికెట్ ధర రూ. 200 కాగా.. గరిష్ఠంగా రూ. 4 వేలు ఉంది. మ్యాచ్ సందర్భంగా 25 వేల కాంప్లిమెంటరీ పాసులను పాఠశాల విద్యార్థులకు కేటాయించారు. విద్యార్థులకు ఉచిత భోజనం కూడా అందిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను గణతంత్ర దినోత్సవం నాడు ఉచితంగా మ్యాచ్‌కు అనుమతిస్తామని చెప్పాడు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని వివరించారు. ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక కుటుంబాలకు ఉచితంగా ప్రవేశం కల్పించనుంది. మరుసటి రోజు గణతంత్ర దినోత్సవం(Republic Day) ఉన్నందున సైనికుల గౌరవార్థం వాళ్ల కుటుంబాలను ఫ్రీగా అనుమతించనుంది.
కొనసాగుతున్న విశాఖ టెస్ట్ టికెట్ల విక్రయం
విశాఖ(Visakha)లో ఇండియా - ఇంగ్లాండ్(Ind vs Eng Test) మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విశాఖ VDCA స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందని ACA కమిటీ సభ్యలు వెల్లడించారు. మ్యాచ్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 26 నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మకాలను ఉంచుతామన్నారు. అదే విధంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ACA కమిటీ సభ్యలు తెలిపారు. రెండు క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని జల్లా కలెక్టర్ మల్లిఖకార్జున అన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి సంఘనలు జరగకుండా...ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని నగర సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion