Shubman Gill: గిల్ ట్రిపుల్ సెంచరీని ఆపడానికి ఇంగ్లాండ్ ప్లేయర్ డర్టీ గేమ్, ఫ్యాన్య్ మండిపాటు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. కానీ 31 పరుగులు తేడాతో ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

IND vs ENG 2nd Test: బర్మింగ్ హాంలోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ రెండో రోజు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుతమైన బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత యువ కెప్టెన్ ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించి పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా, అలాగే ఆసియా వెలుపల భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ తన కెరీర్‌లో తొలి ట్రిపుల్ సెంచరీకి 31 పరుగులు దూరంలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ ప్లేయర్లు ఒక చెత్త ఎత్తుగడ వేశారు. దాంతో గిల్ ట్రిపుల్ సెంచరీ కల చెదిరిపోయిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
హ్యారీ బ్రూక్ డర్టీ మైండ్ గేమ్
రెండో రోజు లంచ్ తర్వాత, స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అతను శుభ్‌మన్ గిల్‌తో ట్రిపుల్ సెంచరీ గురించి ప్రస్తావించడం మొదలుపెట్టాడు. అసలే భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా నెగ్గని వేదిక అది. అలాంటి పిచ్ మీద ఆడుతూ ఒత్తిడి తట్టుకుని డబుల్ సెంచరీ చేయడమే ఓ సవాల్. ఈ సమయంలో ట్రిపుల్ సెంచరీ అని పదే పదే ప్రస్తావిస్తూ కెప్టెన్ గిల్‌పై మానసిక ఒత్తిడి పెంచడానికి హ్యారీ బ్రూక్ చేసిన ఈ ప్రయత్నం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ఈ క్రమంలో గిల్ కూడా రెండుసార్లు హ్యారీ బ్రూక్‌కు సమాధానం చెప్పాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ వ్యాఖ్యాతగా వ్యహరించారు. హ్యారీ బ్రూక్.. భారత కెప్టెన్ గిల్‌తో నువ్వు 290 పరుగులు చేయడం చాలా కష్టం... మీకు ఎన్ని ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి తెలుసు కదా?” అన్నాడని వెల్లడించాడు. గిల్ ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 268 పరుగులు, అతను 2018/19లో తమిళనాడుపై మొహాలీలో సాధించాడు. 2024లో పాకిస్తాన్‌తో జరిగిన ముల్తాన్ టెస్ట్‌లో హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
ట్రిపుల్ సెంచరీ కల అసంపూర్ణం
హ్యారీ బ్రూక్ డర్టీ మైండ్ గేమ్ మాటలు గిల్ ఏకాగ్రతను దెబ్బతీశాయి. దాని ఫలితంగా మరుసటి ఓవర్లోనే వారికి రిజల్ట్ వచ్చింది. లంచ్ తర్వాత తదుపరి ఇన్నింగ్స్‌లో జోష్ టంగ్ వేసిన షార్ట్ బాల్‌ను గిల్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అప్పటికే అలసిపోయిన గిల్ బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోయాడు. బంతి బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ అయి స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్ ఓలీ పోప్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ 269 పరుగుల వద్ద ముగిసింది.
గిల్ ట్రిపుల్ సెంచరీ చేసింటే..
శుభ్‌మన్ గిల్ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటే, పలు రికార్డులు అతని పేరిట నమోదయ్యేవి. అవి ఏంటంటే
- ఇంగ్లండ్ గడ్డ మీద ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి విదేశీ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచేవాడు.
- 1964 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ అయ్యేవాడు. దీనికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ బిల్ సింప్సన్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ట్రిపుల్ సెంచరీ చేశాడు.
- ఆసియా వెలుపల ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచేవాడు.





















