IND vs BAN 1ST TEST: బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
IND vs BAN 1ST TEST: చట్టోగ్రామ్ వేదికగా నేడు బంగ్లాదేశ్- భారత్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
IND vs BAN 1ST TEST: చట్టోగ్రామ్ వేదికగా నేడు బంగ్లాదేశ్- భారత్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు స్పిన్... మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ లు పేసర్లుగా ఉన్నారు.
'వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం. స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఫుట్ మార్కులు ఉపయోగించుకుని ప్రత్యర్థి వికెట్లు తీస్తాం. మా జట్టులో కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. అయితే ఇది ఇతర కుర్రాళ్లకు అవకాశంగా మారింది. వారందరూ ఎంతో కొంత క్రికెట్ ఆడారు. ఈ సవాల్ ను స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు.' అని భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.
టాస్ గెలిస్తే తాము కూడా మొదట బ్యాాటింగ్ తీసుకునేవాళ్లమని బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ అన్నాడు. 'ఇది బ్యాటింగ్ కు మంచి వికెట్. అయితే ఈ మైదానం చరిత్ర చూసుకుంటే చివరి రోజు కంటే మొదటి రోజు ఎక్కువ వికెట్లు పడ్డాయి. కాబట్టి ఆరంభంలో కొన్ని వికెట్లు తీసి భారత్ పై ఒత్తిడి పెంచాలనుకుంటున్నాం. మేం 5 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇది చాలా గ్యాప్. అయినా మేం బాగా సిద్ధమయ్యాం. మంచి ప్రదర్శన ఇస్తామని ఆశిస్తున్నాం. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.' అని షకీబ్ అన్నాడు.
A look at #TeamIndia's Playing XI for the first #BANvIND Test 🔽
— BCCI (@BCCI) December 14, 2022
Follow the match ▶️ https://t.co/CVZ44NpS5m pic.twitter.com/KgshrnZh8i
భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ తుది జట్టు
జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్.
Bangladesh vs India: 1st test
— Bangladesh Cricket (@BCBtigers) December 14, 2022
Bangladesh playing XI#BCB | #cricket | #BANvIND pic.twitter.com/g3iHTRcZU6
Test-mode 🔛
— BCCI (@BCCI) December 13, 2022
Preps done, all set for the #BANvIND Test 👌#TeamIndia pic.twitter.com/yqX2iDXYrm