అన్వేషించండి

IND vs AUS T20: నేడే రెండో టీ 20 మ్యాచ్‌ , పొంచి ఉన్న వర్షం ముప్పు

India vs Australia 2nd T20: ఆస్ట్రేలియాతో   జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో విజయం కోసం పట్టుదలగా ఉంది.

ఆస్ట్రేలియాతో   జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న టీమిండియా... కంగారులపై రెండో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. నేడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో కూడా  గెలిచి అధిక్యం సాధించాలని యువ భారత్‌ పట్టుదలగా ఉంది. ఆసీస్‌ కూడా బోణీ కొట్టాలని చూస్తోంది. గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం పిచ్‌ బౌలర్లకు ప్రధానంగా స్పిన్నర్లకు సహరికంచే అవకాశం ఉండడంతో తక్కువ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ స్టేడియంలో  మెుత్తం 3అంతర్జాతీయ టీ20మ్యాచ్‌లు జరగగా రెండింటిలో ఛేజింగ్‌ చేసిన జట్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.
 
విశాఖలో జరిగిన మెుదటి టీ-20లో రాణించిన కెప్టెన్‌ సూర్యకుమార్‌తోపాటు వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌, రింకూసింగ్‌లు మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. దురదృష్టవశాత్తు మెుదటి ‌మ్యాచ్‌లో రనౌటైన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ మ్యాచ్‌లో రాణించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మొదటి టీ-20 మ్యాచ్‌లో....భారత్‌ బౌలింగ్‌లో  ఘోరంగా విఫలమయ్యింది. పేసర్‌ ముఖేశ్‌ కుమార్‌ మినహా బౌలర్లంతా విఫలమయ్యారు. పేసర్లు అర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ధకృష్ణలు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌లు పూర్తిగా విఫలమయ్యారు. గ్రీన్‌ఫీల్డ్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలం కావటంతో వారి ప్రదర్శనపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 
 
మెుదటి టీ-20 మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన ఆసీస్‌ సిరీస్‌లో  బోణీకొట్టాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన జోష్‌ ఇంగ్లిస్‌తోపాటు సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఫామ్‌లో ఉండడం కలిసివచ్చే అవకాశం ఉంది. స్టార్‌ ఆటగాళ్లు మాక్స్‌వెల్‌, ట్రావిస్‌ హెడ్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నా ఆసీస్‌ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రెండో టీ-20లో స్పిన్నర్లు జంపా, తన్వీర్‌ సంగాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 5 టీ ట్వంటీల సిరీస్‌లో ఆధిక్యాన్నిన2-0కు పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా...... పరాజయం పాలవ్వడం కంగారులను ఆందోళనకు గురి చేస్తోంది. చివరి బంతి వరకూ పోరాడినా విజయం దక్కకపోవడంపై ఆస్ట్రేలియన్లు ఆందోళనగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సమస్యలను అధిగమించి విజయం సాధించాలని ఆసిస్‌ గట్టి పట్టుదలతో ఉంది.
 
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
 
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Embed widget