అన్వేషించండి

T20 World Cup IND W VS NL W : ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్.. రెండో విజ‌యంపై టీమిండియా మహిళల గురి.. సెమీస్ చేరాలంటే హ‌ర్మ‌న్ సేన‌ ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిందే!

పాకిస్తాన్‌పై గెలిచిన జోష్‌లో ఉన్న ఇండియా ఇప్పుడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది, సెమీస్ రేసులో ఉండాలంటే బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం టీమ్‌కు చాలా ముఖ్యం. తొలి మ్యాచ్ లోని తప్పులను రిపీట్ కాకుండా చూసుకోవాలి.

India Aim For Better Batting Performance: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం ఇండియా తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనుంది. పాకిస్తాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో స్మృతి మంధాన టాప్ ఆర్డర్‌లో, రిచా ఘోష్ లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించి జట్టును ఆదుకున్నారు. అయితే మిగిలిన బ్యాటర్ల నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించలేదు. ముఖ్యంగా ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో భారతి ఫుల్మాలి కీలక పాత్ర పోషించాల్సి ఉన్నా, ఫస్ట్ మ్యాచ్‌లో నిరాశపరిచింది. లీగ్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి బలమైన టీమ్స్‌తో పోరాడాలంటే ఇండియా బ్యాటర్లు మరింత కన్సిస్టెన్సీ చూపించాల్సిన అవసరం ఉంది.

Read Also: Vaibhav Sooryavanshi Hard Work: రోజూ 8 గంటల ప్రాక్టీస్, 100 ఓవర్ల బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్ -  వండర్ కిడ్ వెనుక ఉన్న కష్టం ఇదీ!

బౌలింగ్ లో స్పిన్ మాయ‌.. పేసర్ల జోరు మిస్..
పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో ఇండియా స్పిన్ ద్వయం దీప్తి శర్మ, శ్రీ చరణి ప్రత్యర్థిని వణికించారు. వీరిద్దరూ కలిసి ఎనిమిది వికెట్లు తీయగా, దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగింది. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన సిరీస్‌లో కాస్త ధారాళంగా రన్స్ ఇచ్చిన దీప్తి, కరెక్ట్ టైమ్‌లో ఫామ్‌లోకి రావడం ఇండియాకు ప్లస్ పాయింట్. ఇక యంగ్ స్పిన్నర్ శ్రీ చరణి తన లైన్ అండ్ ఫ్లైట్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను సైతం ఇబ్బంది పెడుతోంది. అయితే పేసర్లు అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ ఫస్ట్ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వీరు ఎర్లీ బ్రేక్ త్రూస్ ఇచ్చి టీమ్‌ను ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Also: Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?

ఫీల్డింగ్ లో మెరుగుపడాలి..
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. స్టార్టింగ్‌లో కొన్ని ఈజీ క్యాచ్‌లు మిస్ చేసినా, ఇన్నింగ్స్ చివర్లో మాత్రం కొన్ని మంచి క్యాచ్‌లు అందుకున్నారు. సెమీఫైనల్ రేసులో ఉండాలంటే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి జట్లతో తలపడేటప్పుడు ఒక్క రన్ కూడా వేస్ట్ చేయకుండా చూడాలి. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఈజీగానే అనిపించినా, సెమీస్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాలో ఏదో ఒక టీమ్‌ను ఇండియా కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌ను ఒక ప్రాక్టీస్ లాగా కాకుండా పర్ఫెక్ట్ గేమ్‌లా ఆడాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

డచ్ టీమ్ సవాల్.. 
మరోవైపు నెదర్లాండ్స్ టీమ్ బంగ్లాదేశ్‌పై ఓడిపోయి ఈ మ్యాచ్‌కు వస్తోంది. ఇండియాకు పోటీ ఇవ్వాలంటే డచ్ టీమ్ అన్ని విభాగాల్లో ఇంప్రూవ్ అవ్వాలి. "బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మూడు విభాగాల్లోనూ మేము ఆశించినంత ఫైర్ చూపించలేదు. బ్యాటింగ్‌లో కొన్ని రన్స్ తక్కువ చేశాం, వికెట్లు కూడా త్వరగా కోల్పోయాం. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు డ్రాప్ చేశాం. ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవాలి" అని నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడ్ స్పష్టం చేసింది. ఇండియాను నిలువరించాలంటే డచ్ టీమ్ తన గేమ్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలి.

Frequently Asked Questions

భారత్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో తమ తదుపరి మ్యాచ్ ఎవరితో ఆడుతుంది?

ఉమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ఇండియా నెదర్లాండ్స్‌తో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను ఆడనుంది.

పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ప్రదర్శన ఎలా ఉంది?

స్మృతి మంధాన, రిచా ఘోష్ రాణించినా, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. మిగిలిన బ్యాటర్ల నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగంలో ఎవరు రాణించారు?

దీప్తి శర్మ ఐదు వికెట్లు, శ్రీ చరణి తమ స్పిన్ మాయతో ప్రత్యర్థిని వణికించారు. అయితే పేసర్లు మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

బలమైన జట్లను ఎదుర్కోవడానికి భారత్ ఏ విభాగాలలో మెరుగుపడాలి?

బ్యాటింగ్‌లో మరింత స్థిరత్వం, పేసర్ల నుండి ఎర్లీ బ్రేక్‌త్రూలు, అలాగే ఫీల్డింగ్‌లో మెరుగుదల అవసరం. ఇది సెమీఫైనల్ రేసులో కీలకం.

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vaibhav Sooryavanshi News: సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్
సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget