Ind Declared VS AFG: భారత్ తొలి ఇన్నింగ్స్ 564 రన్స్ కు డిక్లేర్డ్.. గిల్, రాహుల్ సెంచరీలు.. సలీమ్ కి 6 వికెట్లు
అఫ్గానిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ను 564 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. గిల్, రాహుల్ సెంచరీలు చేయగా, సుదర్శన్, సుందర్, పంత్ అర్థ సెంచరీలు చేశారు.

IND VS AFG 1st Test Live Updates: ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ ఒన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ డే ఆట ఆసక్తికరంగా సాగింది. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ ను 8 వికెట్ల నష్టానికి 564 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. అంతకంటే ముందు 368/3 ఓవర్ నైట్ స్కోర్ తో సెకండ్ డే బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియాను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (177 బంతుల్లో 126, 15 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో లీడ్ చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టాడు. ఇక ఆదివారం రిషభ్ పంత్ తో కలిసి ఫోర్త్ వికెట్ కు 169 రన్స్ పార్టనర్ షిప్ బిల్డ్ చేశాడు. పంత్ , సాయి సుదర్శన్ చెరో 81 రన్స్ చేయగా, వాషింగ్టన్ సుందర్ 52 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో సలీమ్ కి 6 వికెట్లతో మెరిశాడు. జియావుర్ రెహమాన్, హష్మతుల్లా షాహిదీ చెరో వికెట్ తీసుకున్నారు.
Innings Break!#TeamIndia declare the first innings with a massive total of 5️⃣6️⃣4️⃣/8 on the board🔥
— BCCI (@BCCI) June 7, 2026
Over to our bowlers now! 👌
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ARlzKKkQ4S
అఫ్గాన్ టీమ్ రివ్యూ బ్లండర్.. పంత్, గిల్ కు దక్కిన లైఫ్స్
సెకండ్ డే మార్నింగ్ సెషన్ లో అఫ్గానిస్తాన్ టీమ్ కొత్త బాల్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన 89వ ఓవర్ లో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇద్దరూ అవుట్ అయినట్లే కనిపించారు. ఒమర్జాయ్ బౌలింగ్ లో గిల్ ఎల్బీడబ్ల్యూగా, పంత్ కీపర్ క్యాచ్ గా దొరికిపోయినట్లు అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఆ టైమ్ లో అఫ్గాన్ దగ్గర ఒక రివ్యూ ఉన్నా కెప్టెన్ షాహిదీ రివ్యూ తీసుకోకుండా పెద్ద మిస్టేక్ చేశాడు. ఆ తర్వాత పంత్, గిల్ చెలరేగి ఆడుతూ ఫోర్లు కొట్టారు. గిల్ అద్భుతమైన కట్ షాట్ తో ఇండియా స్కోర్ ను 400 దాటించాడు.
సలీమ్ సూపర్ బౌలింగ్ స్పెల్..
అఫ్గాన్ పేసర్ మొహమ్మద్ సలీమ్ లంచ్ కంటే ముందు పర్ఫెక్ట్ లెంత్ తో బౌలింగ్ చేసి ఇండియాకు షాక్ ఇచ్చాడు. తన ఓవర్ నైట్ స్కోర్ కు 23 రన్స్ యాడ్ చేసిన శుభ్‌మన్ గిల్ ను సలీమ్ , కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ (19) ఫోర్ కొట్టి ఇండియా స్కోర్ ను 450 కి చేర్చిన వెంటనే సలీమ్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సలీమ్ తన స్పెల్ లో రన్స్ ఎక్కువగా ఇచ్చినప్పటికీ గిల్, జురెల్ లాంటి ఇంపార్టెంట్ వికెట్లను తీసి అఫ్గాన్ కు బ్రేక్ ఇచ్చాడు.
సుందర్ అజేయ ఫిఫ్టీ..
రిషభ్ పంత్ లేజీ రన్నింగ్ వల్ల ఒకసారి రనౌట్ నుంచి తప్పించుకున్నా, స్పిన్నర్ షాహిదీ బౌలింగ్ లో లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చి 81 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. డెబ్యూ ప్లేయర్ మానవ్ సుతార్ (28), వాషింగ్టన్ సుందర్ తో కలిసి లంచ్ టైమ్ వరకు క్రీజులో నిలబడటంతో ఇండియా ఫస్ట్ సెషన్ ముగిసే సమయానికి 6 వికెట్లకు 475 రన్స్ చేసింది. లంచ్ తర్వాత స్కోర్ ను 564 కి చేర్చి డిక్లేర్ చేయడంతో అఫ్గానిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సుందర్ అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.
ట్రెండింగ్ వార్తలు



















