IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో పరుగుల పండుగ.. సెంచరీలతో రాహుల్, గిల్ సత్తా, రాణించిన సుదర్శన్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌలర్లు
గిల్, రాహుల్ సెంచరీలతో సత్తా చాటడంతో తొలిరోజు టీమిండియా పట్టు బిగించింది. అనుభవం లేని ఆఫ్గాన్ బౌలర్లను ఆటాడుకుంటూ, బ్యాటర్లు పరుగులు పండుగ చేసుకున్నారు.

IND VS AFG 1st Test Day 1 Latest Update: ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. రెండు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు నమోదయ్యాయి. ముఖ్యంగా శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (143 బంతుల్లో 103 బ్యాటింగ్, 11 ఫోర్లు, 1 సిక్సర్), వెటరన్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీల (165 బంతుల్లో 100, 11 ఫోర్లు) తో కదం తొక్కారు. న్యూ చండీగఢ్ లో జరుగుతున్న ఏకైక టెస్టులో శనివారం తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆటముగిసేసరికి 85 ఓవర్లలో 3 వికెట్లకు 368 పరుగులు చేసి, భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. సలీమ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇక భారత కెప్టెన్ గిల్ కు సొంతగడ్డపై ఇదే తొలి టెస్టు మ్యాచ్ సారథిగా కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ ముందు ఆఫ్గాన్ బౌలర్లు తేలిపోయారు. రోజంతా బౌలింగ్ చేసి, కేవలం 3 వికెట్లు మాత్రమే తీశారు.
Stumps on Day 1️⃣
— BCCI (@BCCI) June 6, 2026
Fabulous centuries from Captain Shubman Gill and Vice-captain KL Rahul power #TeamIndia's charge 💪
We will resume proceedings tomorrow at 368/3 👌
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/sjVmjH8WLv
రాహుల్ క్లాస్..
పస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24) త్వరగా ఔటయ్యాడు. 5 ఫోర్లతో మంచి టచ్ లో కనిపించిన అతడిని, మహమ్మద్ సలీమ్ పెవిలయన్ కు పంపాడు. ఈ దశలో వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ (104 బంతుల్లో 81, 13 ఫోర్లు) తో కలిసి రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లోని జోరును కొనసాగిస్తూ, వీరిద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. తొలుత రాహుల్ 86 బంతుల్లో, సుదర్శన్ 67 బంతుల్లో అర్ధ సెంచరీలు కంప్లీట్ చేశారు. అయితే రెండో వికెట్ కు 139 పరుగులు జోడించాక, సుదర్శన్ ఔటయ్యాడు. ఇక కాసేపటికే 164 బంతుల్లో కెరీర్లో 12వ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్, తర్వాతి బంతికే ఔటయ్యాడు. అంతకుముందు గిల్ తో కలిసి మూడో వికెట్ కు 67 పరుగులు జోడించాడు.
సొంతగడ్డపై సెంచరీ..
డొమెస్టిక్ లో పంజాబ్ తరపున ఆడే గిల్.. తన సొంత మైదానం చండీగఢ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. ఆరంభం నుంచే సాధికారికంగా బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (70 బంతుల్లో 50 బ్యాటింగ్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి జోరు కొనసాగించాడు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేసి, మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఈ క్రమంలో 68 బంతుల్లో గిల్, 70 బంతుల్లో పంత్ అర్థ సెంచరీలు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత రోజు ముగుస్తుందన్న క్రమంలో కెరీర్ లో 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక సెషన్ కో వికెట్ చొప్పున ఆఫ్గాన్ బౌలర్లు మూడు వికెట్లు మాత్రమే తీశారు. ఈ మ్యాచ్ లో మానవ్ సుతార్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు



















