IND Vs WI, 1st T20: ఇక పొట్టి సమరం - టీ20లలో విండీస్‌తో అంత వీజీ కాదు
నెల రోజుల సుదీర్ఘ పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌కు వచ్చిన భారత జట్టు.. టెస్టు, వన్డే సిరీస్‌లను విజయవంతంగా ముగించుకుని నేటి నుంచి టీ20లు ఆడనుంది.
IND Vs WI, 1st T20: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు టెస్టు, వన్డే సిరీస్‌లను విజయవంతంగా ముగించి నేటి నుంచి టీ20 బరిలోకి దూకనుంది. టెస్టు సిరీస్‌ను 1-0, వన్డే సిరీస్‌ను 2-1 తో గెలుచుకున్న భారత్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు ట్రినిడాడ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో విండీస్‌తో తలపడనుంది. 2024 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగుతున్న భారత జట్టు.. అదే లైన్‌లో వెస్టిండీస్ కూడా అమీతుమీకి సిద్ధమంటోంది.
విండీస్‌తో వీజీ కాదు..
టెస్టులు, వన్డేలలో భారత్‌కు ఆతిథ్య జట్టు నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోయినా పొట్టి ఫార్మాట్‌లో మాత్రం వెస్టిండీస్ చాలా ప్రమాదకర టీమ్. ప్రపంచంలో ఎక్కడ టీ20 టోర్నీ జరిగినా అక్కడ ఉండే విండీస్ వీరులు.. క్షణాల్లో మ్యాచ్‌లను మలుపు తిప్పగల సమర్థులు. ఓపెనింగ జోడీ నుంచి లోయరార్డర్ బ్యాటర్ వరకూ హిట్టింగ్ చేయగలిగేవాళ్లే.. కైల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్, షిమ్రన్ హెట్‌మెయర్, నికోలస్ పూరన్, రోమన్ పావెల్, ఛార్లెస్ వంటి హిట్టర్లు ఆ జట్టు సొంతం.
ప్రస్తుతం విండీస్ టీ20 జట్టులో ఉన్న చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున ఆడినవాళ్లే. బౌలింగ్ విభాగంలో జేసన్ హోల్లర్, ఒడియన్ స్మిత్, ఒబెడ్ మెక్‌కాయ్, రొమారియా షెపర్డ్‌లు ప్రమాదకరం. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వందలాది మ్యాచ్‌లు ఆడిన వెస్టిండీస్ ఆటగాళ్లకు ఇక్కడ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉండటం వారికి కలిసొచ్చేదే. అంతేగాక ఐపీఎల్‌లో కలిసి ఆడటం వల్ల భారత ఆటగాళ్లు ఎలా ఆడతారు..? వాళ్ల బలహీనతలు ఏంటనేవి కూడా వారికి అవగాహన ఉంది.
టీమిండియాలో కొత్త ముఖాలు..
ఈసారి భారత టీ20 జట్టులో కొన్ని కొత్త ముఖాలు రానున్నాయి. ఐపీఎల్‌లో దుమ్మురేపిన కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలు ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశముంది. వన్డే సిరీస్‌లో అదరగొట్టిన ముకేష్ కుమార్ కూడా తుది జట్టులో ఉండొచ్చు. అర్ష్‌దీప్ సింగ్ రాకతో భారత పేస్ బౌలింగ్ దళం కూడా బలంగానే ఉంది. అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ట్రినిడాడ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిన నేపథ్యంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో వెళ్లే అవకాశాలున్నాయి. యశస్వి వస్తే ఇషాన్ మిడిలార్డర్‌కి పరిమితమవుతాడు. వన్డే సిరీస్‌లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. టీ20లలో ఏం చేస్తాడో మరి..
మ్యాచ్, లైవ్ వివరాలు:
- భారత్ - వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో నేటి (గురువారం) రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.
- ఈ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. వెబ్ సైట్స్, మొబైల్స్ అయితే ఫ్యాన్ కోడ్ (సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి), జియో సినిమా (ఇది ఉచితమే)లలో వీక్షించొచ్చు.
📸🤝
— BCCI (@BCCI) August 3, 2023
T20I mode 🔛#TeamIndia | #WIvIND pic.twitter.com/Ftpp4AINGI
జట్లు :
వెస్టిండీస్ : రోమన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, జాన్సన్ ఛార్లెస్, రోస్టన్ ఛేజ్, షిమ్రన్ హెట్‌మెయర్, జేసన్ హోల్డర్, షై హోప్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రొమారియా షెపర్డ్, ఒడియన్ స్మిత్, ఒషేన్ థామస్
ఇండియా : ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial