IND vs SL: శ్రీలంకతో సిరీస్ కు జట్టులో దక్కని స్థానం- వైరల్ గా మారిన పృథ్వీ షా పోస్ట్
IND vs SL: శ్రీలంకతో సిరీస్ లకు జట్టులో చోటు దక్కని భారత యువ బ్యాటర్ పృథ్వీ షా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రెండు పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.
IND vs SL: శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఇందులో భారత యువ బ్యాటర్ పృథ్వీ షాకు ఏ సిరీస్ లోనూ స్థానం లభించలేదు. దీనిపై ఆవేదన చెందిన షా తన సోషల్ మీడియా అకౌంట్ లో రెండు పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
భారత్ క్రికెట్ లో అసమానమైన ప్రతిభ ఉంది. తుది జట్టులోనే కాక రిజర్వ్ బెంచ్ లోనూ అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో ఒక్కో స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ప్రతి ఆటగాడికి సవాల్ గా మారింది. ప్రస్తుతం పృథ్వీషా పరిస్థితి కూడా అలానే ఉంది. శ్రీలంకతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు ఏ ఒక్కదానిలోనూ సెలక్టర్లు పృథ్వీని సెలక్ట్ చేయలేదు. ఓపెనర్ గా వచ్చే షా చివరిసారిగా జూలై 2021 లో భారత్ తరఫున ఆడాడు. అప్పటినుంచి మళ్లీ టీమిండియాకు ఆడలేదు. దేశవాళీల్లో రాణిస్తున్నప్పటికీ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఇప్పుడు లంకతో జరిగే సిరీస్ లకు అతడిని ఎంపికచేయలేదు.
ఈ క్రమంలోనే శ్రీలకంతో సిరీస్ లకు జట్ల ప్రకటన తర్వాత పృథ్వీ షా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రెండు పోస్టులు పెట్టాడు. ఒకటి కవిత్వం కాగా.. రెండో గౌర్ గోపాల్ దాస్ చెప్పిన మాటల వీడియో.
ఎవరైనా నవ్వుతూ ఉంటే వారు తమ జీవితంలో సంతోషంగా ఉన్నారని కాదు. ఆనందం ఎప్పుడూ దానంతటదే రాదు కానీ సమస్యలు మాత్రం వాటంతటవే వస్తాయి.
ఎవరైనా సానుకూలత, ప్రేమ, సంతోషాన్ని ఎంచుకుంటారు. కోపం, ద్వేషం, ప్రతికూలత అనేవి మనుషులలో స్వయంచాలకంగా ఉంటాయి. ప్రేమ, సానుకూలత ఎంచుకుంటేనే మనం మనుషులుగా ఉంటాం.
అని గౌర్ గోపాల్ దాస్ చెప్పిన మాటల వీడియోను పంచుకున్నాడు.
దేశవాళీ టోర్నీల్లో పృథ్వీ షా ఇటీవల ప్రదర్శన
- ప్రస్తుతం పృథ్వీ షా రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. 4 ఇన్నింగ్సుల్లో 10.50 సగటుతో 42 పరుగులు చేశాడు.
- విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్సుల్లో 217 పరుగులతో రాణించాడు. అందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.
- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 10 మ్యాచులు ఆడిన పృథ్వీ షా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సహా 332 పరుగులు సాధించాడు.
బీసీసీఐ షాను ఎందుకు విస్మరిస్తోంది
పృథ్వీ షా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లు రాణిస్తున్నారు. వారు ఫాంలో ఉన్నారు. అలాగే రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో షాకు స్థానం దక్కడం కష్టమే.
Typical Prithvi Shaw moment!😔 Why @BCCI ?? pic.twitter.com/fExmgLLqFn
— Nandini Sharma (@nandinisharma99) December 28, 2022