Rain Stops IND VS SA 5th T20I: వర్షం కారణంగా ఆగిన ఐదో టీ20 - ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా!
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆగింది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. టాస్ వేశాక వర్షం అంతరాయం కలిగించడంతో 50 నిమిషాల తర్వాత మ్యాచ్ ప్రారంభం అయింది. మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. అయితే మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే మళ్లీ వర్షం పడటంతో మళ్లీ ఆట ఆగింది. వర్షం కారణంగా గేమ్ ఆగే సమయానికి టీమిండియా 3.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యారు.
కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్ రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే లుంగి ఎంగిడి తన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్‌ను (15: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు), నాలుగో ఓవర్లో ఆట ఆగడానికి ముందు రుతురాజ్ గైక్వాడ్‌ను (10: 12 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేశాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో పంత్ వరుసగా ఐదోసారి కూడా టాస్ ఓడిపోయాడు. నాలుగు టీ20ల్లో భారత్, దక్షిణాఫ్రికా తలో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. దీంతో ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. వర్షం కారణంగా ఓవర్లు తగ్గడం మాత్రం కచ్చితంగా మారింది. గత మ్యాచ్‌లో కెప్టెన్ తెంబా బవుమా గాయపడటంతో కేశవ్ మహరాజ్ ఈ మ్యాచ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
టీమిండియా తుదిజట్టు
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా తుదిజట్టు
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, రాసీ వాన్ డర్ డుసెన్, హెన్రిక్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), లుంగి ఎంగిడి, కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జే
View this post on Instagram