అన్వేషించండి

SA vs IND Siraj Records: ప్రొటీస్‌ పేరిట చెత్త రికార్డులు, సిరాజ్‌ పేరిట కొత్త రికార్డులు

SA vs IND 2nd Test News: కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పేసర్ మహ్మద్‌ సిరాజ్‌.. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు.

IND vs SA 2nd Test Live Updates: కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

అద్భుతమైన సెషన్ వేసిన సిరాజ్ 
కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు. ఒకే ఓవర్లో బెడింగ్‌హామ్‌ (12), మార్కో జాన్‌సెన్ (0)ని ఔట్ చేసి సిరాజ్‌ ఐదు వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో వెరినే (15).. స్లిప్‌లో శుభ్‌మన్‌కు చిక్కాడు. దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ను బుమ్రా.. కేశవ్‌ మహరాజ్‌ను ముఖేష్‌కుమార్‌ అవుట్‌ చేశారు. దీంతో 50 పరుగులకే సఫారీలు ఎనిమిది వికెట్లు కోల్పోయారు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి ప్రొటీస్‌ 55 పరుగులకే కుప్పకూలడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది.

సౌతాఫ్రికాకు టెస్ట్‌ల్లో ఇదే అత్యల్ప స్కోర్‌ 
1992లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్‌ల్లో ఇదే అత్యల్ప స్కోర్‌ కాగా.. టెస్ట్‌ల్లో భారత్‌పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్‌ కావడం విశేషం. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్‌ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్‌లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్‌ సింగ్‌ (5/13) తర్వాతి స్థానాల్లో నిలిచారు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్‌ ఠాకూర్‌ (7/61) టాప్‌లో ఉండగా.. హర్బజన్‌ సింగ్‌ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు 36 సార్లు మాత్రమే జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్‌ కాగా.. అత్యధిక సందర్బాల్లో ఏడు సార్లు కేప్‌టౌన్‌లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్‌టౌన్‌ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్‌ మైదానంలో చేశాయి.
 సిరాజ్‌ టెస్ట్‌ క్రికెట్‌లో కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. 9 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు నేలకూల్చాడు. బుమ్రా రెండు, ముఖేష్‌ కుమార్‌ రెండు వికెట్లు తీశారు. టీమిండియా పేసర్ల ధాటికి తొమ్మిది మంది దక్షిణాఫ్రికా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో అత్యధిక స్కోరు 15 పరుగులే అంటే భారత సీమర్లు ఎంతలా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా పేసర్ల దెబ్బకు సఫారీ జట్టు టాప్ 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు క్యూ కట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget